Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుమ్ముగూడెం
ఏజన్సీ ప్రాంత వాసిని అని నా చదువులు చక్క దిద్దిన ఏజన్సీ ప్రాంత అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ అన్నారు. నర్సాపురం మోడల్ పంచాయతీగా తీర్చి దిద్దేందుకు జీఎమ్ఎఫ్ నిధుల ద్వారా రూ.1 కోటి 06 లక్షలు, ప్రపంచ బ్యాంకు హడ్కో ద్వారా రూ.70 లక్షలతో చేపట్టబోయే అభివృద్ధి పనులను శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే పొదెం వీరయ్య అధ్యక్షతన రైతు వేదిక భవనంలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. నర్సాపురం గ్రామంతో ఉన్న సంబందాన్ని తెలుపడంతో ఆ మక్కువతోనే నర్సాపురం గ్రామ పంచాయతీనీ రాష్ట్రంలో మోడల్ పంచాయతీగా తీర్చి దిద్దేందుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించడం జరిగిందన్నారు. భద్రాద్రి జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందన్నారు. జిల్లా కేంద్రాన్ని ఒక కారిడార్‌గా తీర్చి దిద్దేందుకు పాల్వంచలో కలెక్టరేతో పాటు రూ.700 వందల కోట్లతో మెడికల్ కాలేజీని మంజూరు చేయడం జరిగిందన్నారు. మణుగూరులో ఏర్పాటు చేసిన బిటిపిఎస్ ద్వారా 1080 మెగా వాట్ల విద్యుత్ ఉత్సత్తి అవుతుం దన్నారు. సింగరేణి గనులు సిరులు కురిపిస్తున్నాయని, గోదావరి ద్వారా జిల్లాలోని ప్రతి గిరిజన పల్లెకు మిషన్ భగీరధ నీరు అందించడం జరుగుతుందన్నారు. రైతుల త్యాగాల ఫలితంగా గోదావరి నదుల పై సాగు నీటి ప్రాజెక్టులు నిర్మించి లక్షల ఎకరాలకు సాగు నీరు అందించడం జరుగుతుందన్నారు. సీతమ్మ సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ద్వారా గోదావరి నది పై లిప్టు ఇరిగేషన్లు నిర్మిస్తామన్నారు. 2013 భూ సేకరణ చట్టంపై కొంత మందికి అవగాహన లేకుంగా మాట్లాడుతున్నారని ఆ చట్టం ప్రకారం ఏజన్సీలో మార్కెట్ విలువ ప్రకారం ఎకరాకు 3 లక్షలు మాత్రమే వస్తాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రత్యేక చొరవతో 2016 భూ సేకరణ చట్టం తీసుకు రావడం వలన సీతమ్మ సాగర్ భూ నిర్వాసితులకు రూ.8 లక్షలు అందజేయడం జరుగుతుందని, మెరుగైన పరిహారం కోసం కృషి చేస్తానన్నారు. యూపీఏ ప్రభుత్వం తీసుకు వచ్చిన 2005 అటవీ హక్కుల చట్టం 2014లో బీజేపీ ప్రభుత్వం తొలగించిందని కేంద్ర ప్రభుత్వంపై ఆర్ఓఎఫ్ఆర్ చట్టం తీసుకు వచ్చే విదంగా కృషి చేసి అర్హులైన ప్రతి ఒక్కరికీ హక్కులు కల్పించే విదంగా చర్యలు తీసుకుంటామన్నారు. గిరిజనుల సాగులో ఉన్న భూముల దృష్టికి అటవీ అధికారులు వెళ్ల వద్దని కొంత సంయనం పాటించాలని ముఖ్యమంత్రి స్వయంగా ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఆయన పారిశుధ్య పనుల నిర్వహణ కోసం నర్సాపురం గ్రామ పంచా యతీకు పువ్వాడ ఫౌండేషన్ ద్వారా రూ.5 లక్షల చెక్కును సర్పంచ్ వర్షా శివరామకృష్ణ, ఉపసర్పంచ్ రావులపల్లి రవికుమార్‌కు అందజేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, కలెక్టర్ అనుదీప్, ఎమ్మెల్సీ బాలసాని లకీëనారాయణ, జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య, గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, ఎంపీపీ రేసులకీë, జెడ్పీటీసీ తెల్లం సీతమ్మ, సీఐ నల్లగట్ల వెంకటేశ్వర్లు, తహశీల్దార్ వర్సా రవికుమార్, ఎంపిడిఓ ఎం.చంద్రమౌళి, ఎంపీటీసీ కుంజా కనకరత్నం, టీఆర్ఎస్ పార్టీ నియోజక వర్గ ఇన్చార్జీ తెల్లం వెంకట్రావ్, మండల అధ్యక్షుడు అన్నెం సత్యనారాయణ మూర్తి, పూజారి సూర్యచందర్ రావు, రమేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.