Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
ఛత్తీస్గడ్ రాష్ట్రం బీజాపుర్ జిల్లా ఉసూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని రాంపుర్ గ్రామానికి చెందిన నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీ దళ సభ్యురాలు ముసకి బుద్రి శనివారం భద్రాచలం అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జి.వినీత్ సమక్షంలో లొంగిపోయారు. ఈమె గతంలో సీపీఐ మావోయిస్ట్ తెలంగాణ స్టేట్ కమిటీ సెక్రెటరీ హరిభూషన్ (లేటు) ప్రొటెక్షన్ టీమ్‌లో గార్డుగా పనిచేసినట్టు ఏఎస్పీ తెలిపారు. ఈమె ఎస్ఎల్ఆర్ ఆయుధం ఉపయోగించేదని, రక్త హీనతతో బాధపడుతున్న ఈమెకు చిన్న కుమారుడు ఉన్నాడని, పోలీసు శాఖ తరఫున ఈమెకు మెరుగైన వైద్యం అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈమె భర్త అయిన సోమడాల్ ఏ సోమనార్ ఏ నరేష్ కూడా నిషేదిత సిపిఐ మావోయిస్ట్ పార్టీలో ఏరియా కమిటీ మెంబర్‌గా పనిచేస్తున్నాడని తెలిపారు. అనారోగ్య కారణాల వలన మావోయిస్ట్ పార్టీ నాయకులు ఆమెకు సరైన వైద్యం అందించనందున, వారి వేధింపులు తట్టుకోలేక జనజీవన స్రవంతిలో కలిసి ప్రశాంత జీవితం గడప టానికి లొంగిపోయినట్లు ఏఎస్పీ తెలిపా రు.
ఈమె భర్త అయిన సోమడాల్ ఏ సోమనార్ ఏ నరేష్ కూడా నిషేదిత మావోయిస్ట్ దళం నుండి బయటికి వచ్చి ప్రశాంతమైన జీవనం సాగించాలని పోలీసుల తరపున విజ్ఞప్తి చేశారు. మావోయిస్ట్ పార్టీలో పనిచేసే దళ సభ్యులు, మిలిషి యా సభ్యులు వారి బంధువుల ద్వారా గాని, స్థానిక పోలీసు అధికారులు ద్వారా గాని ప్రశాంత జీవనాన్ని గడపటానికి లొంగిపోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.