Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఖమ్మం : పోలీస్ సిబ్బంది సంక్షేమానికి పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. శనివారం పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో పోలీస్ సిబ్బంది సమస్యల పరిష్కార వేదిక ''పోలీస్ స్టాఫ్ వెల్ఫేర్ మీటింగ్'' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్ముడ్ రిజర్వ్ పోలీస్ సిబ్బంది సమస్యలను ఒక్కొక్కరిని అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందికి సంబంధించిన సర్వీసు, సంక్షేమం వంటి విషయాలపై అర్జీలు స్వీకరించారు.అయా అంశాలపై సత్వరమే పరిష్కరించాలని పోలీస్ అధికారులకు ఆదేశించారు. శాఖాపరమైన సమస్యలు, రోజూ వృత్తిరీత్యా ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. త్వరలో పోలీస్ హెడ్ క్వార్టర్స్ అవరణలో మెన్ బ్యారక్స్, రెస్ట్ రూమ్స్, పరేడ్ గ్రౌండ్స్ లో గ్యాలరీ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (ఏఆర్ ) కుమారస్వామి, ఏఎస్పి స్నేహ మెహ్రా, ఏసీపీ ప్రసన్న కుమార్, ఏఆర్ ఏసీపీ విజయబాబు, ఆర్ ఐలు రవి, శ్రీనివాస్, సాంబశివరావు,
తిరుపతి , శ్రీశైలం పాల్గొన్నారు.