Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సమస్యలపై సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలి
అ ఐద్వా జిల్లా కార్యదర్శి మాచర్ల భారతి, రాష్ట్ర ఉపాధ్యక్షులు బుగ్గవీటి సరళ
నవతెలంగాణ- నేలకొండపల్లి
కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో టిఆర్ఎస్ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జిల్లా కార్యదర్శి మాచర్ల భారతి, సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బుగ్గవీటి సరళ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం మండల కేంద్రంలో ఐద్వా మండల మహాసభ బలుసు ప్రమీల అధ్యక్షతన జరిగింది. తొలుత స్థానిక పొట్టి శ్రీరాములు సెంటర్లో సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండాను ఐద్వా జిల్లా అధ్యక్షురాలు బండి పద్మ ఆవిష్కరించారు. అనంతరం జరిగిన మహాసభలో వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న మహిళా వ్యతిరేక విధానాల వలన మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాలలో మహిళలపై ప్రత్యేకించి మైనర్ బాలికలపై నిత్యం దాడులు, అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నా పట్టించుకునే నాధుడే లేడన్నారు. మహిళలపై దాడులు, అనర్ధాలు జరగడానికి మూలమైన మద్యాన్ని నియంత్రించాలి అన్నారు. మహిళలను విలాస వస్తువుగా చూసే పరిస్థితి మారాలి అన్నారు. మహిళలకు రాజకీయాలు అవసరమని అన్నారు. కరోనా సమయంలో మహిళలు వలస కూలీలు పడిన కష్టాలు ఎదుర్కొన్న సమస్యలు వర్ణనాతీతం అన్నారు. వలస కూలీలు ఉపాధి కోల్పోయి తిండి తిప్పలు లేక నడిరోడ్డుపై పస్తులుండి కాలం వెళ్లదీశారన్నారు. కరోనా సమయంలో కమ్యూనిస్టు రాష్ట్రమైన కేరళలో ఉపాధి కోల్పోయిన వలస కూలీలను ప్రత్యేకించి మహిళలకు అవసరమైన బియ్యం, ఉప్పు, పప్పు వంటి నిత్యావసర సరుకుల అన్నింటిని సరిపడా అందించి కంటికి రెప్పలా కాపాడుకున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళలను మాయమాటలతో నిత్యం మోసం చేస్తూ పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. పాలకులు అనుసరిస్తున్న అసమర్థత విధానాలపై మహిళలు చైతన్యవంతమై తిప్పికొట్టాలన్నారు. అనంతరం ఐద్వా మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్ష కార్యదర్శులు బలుసు ప్రమీల, బెల్లం లక్ష్మితో పాటు 13 మంది కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. మహాసభలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు బండి పద్మ, జిల్లా కమిటీ నాయకురాలు పయ్యావుల ప్రభావతి, మండల అధ్యక్ష కార్యదర్శులు బలుసు ప్రమీల, బెల్లం లక్ష్మి, మున్నంగి లక్ష్మి, కొప్పుల జానకమ్మ, పగిడికత్తుల అరుణ, కూచిపూడి శ్రీదేవి, గూగులోతు జ్యోతి, సిరికొండ వెంకట్రావమ్మ, రేగళ్ళ లక్ష్మి, శ్యామలేటి పద్మ తదితరులు పాల్గొన్నారు.