Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కారేపల్లి
ప్రేమించేటప్పుడు అడ్డురాని కులాలు పెళ్లికి అడ్డు వచ్చాయి. రెండేళ్ళుగా ప్రేమిస్తున్నాను అంటూ వెంటపడి పెండ్లి ఊసేత్తితే కులాలు అడ్డుగా ఉన్నాయంటూ ప్రియుడు పెండ్లికి నిరాకరించాడు. దీంతో మనస్ధాపం చెందిన యువతి పేలమందు తాగు ఆత్మహత్యకు ఒడిగట్టిన ఘటన మండల కేంద్రమైన కారేపల్లిలో శనివారం జరిగింది. దీనికి సంబంధించి మృతురాలి కుటుంబ సభ్యులు తెల్పిన వివరాల ఇలా ఉన్నాయి. కారేపల్లికి చెందిన కల్లెపల్లి రాణి(20) ఖమ్మంలో పీజీ మొదటి సంవత్సరం చదువుతుంది. పేరుపల్లి గ్రామానికి చెందిన అలెం నవీన్‌తో కలిసి డిగ్రీ వరకు చదువుకుంది. రెండేళ్లుగా వీరు ఇరువురు ప్రేమించుకుంటున్నారు. ఇటివల రాణి పెండ్లి విషయాన్ని నవీన్‌తో చర్చించింది. ఇద్దరి కులాలు వేరు కావటంతో పెండ్లికి తమ కుటుంబ సభ్యులు ఒప్పుకోవటం లేదని వీడిపోదాం అంటూ నవీన్ చెప్పాడు. దీంతో మార్గమధ్యలో పేలమందు తాగి ఇంట్లోకి వచ్చి ఏడుస్తూ తనను నవీన్ మోసం చేశాడని, తాను పేల మందు తాగిన విషయాన్ని తెల్పింది. వెంటనే తల్లి చుట్టుపక్కల వారిని పిలిచి వెంటనే కారేపల్లి పీహెచ్‌సీకి తరలించి ప్రాధమిక చికిత్స అనంతరం ఖమ్మం అసుపత్రికి తీసుకెళ్లి చికిత్స నిర్వహిస్తుండగా పరిస్ధితి విషమించి రాణి మృతి చెందింది. గతంలో తండ్రి మృతి చెందగా తల్లి కూలీ చేస్తూ రాణిని పీజీ వరకు చదివించింది. కూతురు మృతితో తల్లి లక్ష్మి తల్లడిల్లుతుంది. ఈ మేరకు ఆమె కారేపల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది.