Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- సత్తుపల్లి
సెప్టెంబరు 1వ తేదీ నుంచి పాఠశాలలు పున:ప్రారంభం అవుతున్న నేపధ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లలను ధైర్యంగా పాఠశాలలకు పంపించాలని, ఇందులో ఎలాంటి నిర్బంధం లేదని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. వచ్చేనెల 1 నుంచి పాఠశాలలు తెరుచుకోనున్న నేపధ్యంలో సత్తుపల్లి మండలంలోని కిష్టాపురం పాఠశాలను ఎమ్మెల్యే సండ్ర శనివారం సందర్శించారు. కరోనా ప్రభావంతో యేడాది కాలానికి పైగానే పాఠశాలలు మూతపడ టంతో పాఠశాలల స్థితిగతులు ఎలా ఉన్నా యనే అంశాలను పరిశీలించేందుకు ఎమ్మెల్యే సండ్ర ఈ సందర్శన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ఎమ్మెల్యే సండ్ర విలేకర్లతో మాట్లాడారు. కరోనా ప్రభావం కారణంగా విద్యారంగానికి తీవ్రనష్టం జరిగిందన్నారు. పాఠశాలలను పున:ప్రారంభిం చనున్న క్రమంలో పిల్లలతో ఊడ్పించడం లాంటివి చేయకుండా ఆయా గ్రామ పంచా యతీ, సర్పంచులు, హెచ్ఎంల పర్యవేక్షణలో వీటిని నిర్వహించడం జరుగుతుందన్నారు. కిష్టాపురం పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే సండ్రను ఆ పాఠశాల హెచ్ఎం సీతయ్య టాయిలెట్స్ లేవని చెప్పిన వెంటనే వాటి నిర్మాణానికి అక్కడికక్కడే రూ.2.5లక్షలను మంజూరు చేశారు. ఇవే కాకుండా ఏసీడీపీ నిధుల నుంచి కూడా 40శాతం పాఠశాలలకు ఖర్చు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ దొడ్డా హైమవతిశంకరరావు, ఆత్మ ఛైర్మెన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, జెడ్పీటీసీ కూసంపూడి రామారావు, తుంబూరు సొసైటీ అధ్యక్షుడు చిలుకుర్తి కృష్ణమూర్తి, డీసీసీబీ ఢైరెక్టర్ చల్లగుండ్ల కృష్ణయ్య, ఎంపీడీవో సుభాషిణి, కిష్టాపురం సర్పంచ్ దారావత్ పుల్లమ్మ, ఎంపీటీసీ తుంబూరు కృష్ణారెడ్డి, నాయకులు దొడ్డా శంకరరావు పాల్గొన్నారు.