Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య
నవతెలంగాణ- చింతకాని
రామకష్ణపురం, పందిళ్లపల్లి, నామవరం, జగన్నాధపురం, చింతకాని, కేజీబీవీ లచ్చగూడెం తదితర పాఠశాలలను డీఈవో యాదయ్య శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సెప్టెంబరు ఒకటో తారీకు నుంచి పాఠశాలలు పునః ప్రారంభం అవుతున్న సందర్భంగా పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్వహణ, పాఠశాల ఆవరణ పరిశుభ్రత, పాఠశాలకు హాజరు అవుతున్న ఉపాధ్యాయులు, పిల్లల వివరాలు, వచ్చిన పుస్తకాలు, దుస్తులు తదితర వివరాలను పాఠశాల ప్రధానోపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి శ్యామ్ సన్, సర్పంచ్ సుభద్ర, పంచాయతీ కార్యదర్శి సైదులు. తదితరులు పాల్గొన్నారు.