Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కారేపల్లి
కారేపల్లి మండలంకు మంజూరైన ఏకలవ్య మోడల్ స్కూల్ భవన నిర్మాణానికి ప్రతిపాధించిన పోలంపల్లిలోని స్ధలాన్ని భద్రాచలం ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రు శనివారం పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఏకలవ్య పాఠశాలకు కావల్సిన స్ధల పరిశీలనపై తహసీల్ధార్ డీ.పుల్లయ్య ఆధ్వర్యంలో రెవిన్యూ అధికారులు మండలంలో చీమలపాడు, ఉసిరికాయలపల్లి, పోలంపల్లి గ్రామాల్లో స్ధలాలను పరిశీలించారు. రవాణా ఇతర వసతులను దృష్టిలో ఉంచుకోని పోలంపల్లిలోని స్ధలాన్ని రెవిన్యూ అధికారులు ప్రతిపాధించారు. ఈస్ధలాన్ని పరిశీలించిన పీవో భూమి సంబంధించిన వివరాలను, మ్యాఫ్లను పరిశీలించారు. రూ.20 కోట్లు మంజూరైన ఈ ఏకలవ్య పాఠశాల ఏర్పాటు ద్వారా ఏజన్సీ ప్రాంత విద్యార్ధులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి రానుందని పీవో పేర్కొన్నారు. పాఠశాల ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాధిత స్ధల పరిశీలనకు ప్రతిపాధనలను కలెక్టర్‌కు పంపటం జరుగుతుందని పీవో తెలిపారు. పీవో వెంట గురుకల రీజినల్ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు, తహసీల్ధార్ డీ.పుల్లయ్య, జడ్పీటీసీ వాంకుడోత్ జగన్, వైస్‌ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, సర్పంచ్ గుగులోత్ సక్రు, మాజీ సర్పంచ్‌లు దారావత్ భద్రు, ఇస్లావత్ బన్సీలాల్, కార్యదర్శి కుమార్, టీఆర్ఎస్ యూత్ నాయకులు అజ్మీర యుగుందర్, జర్పల ధోనీ, ఎన్డీ నాయకులు గుగులోత్ తేజా, గ్రామపెద్దలు రమేష్, నారాయణ తదితరులు ఉన్నారు.