Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాల్గొన్న డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ శ్యామ్ మిశ్రా
నవతెలంగాణ-ఇల్లందు
ఏరియాలోని 24 క్లబ్లో శనివారం 15వ ఏరియా లెవెల్ ట్రైపాట్రైట్ సేఫ్టీ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ హైదరాబాద్ రీజియన్-ఐ శ్యామ్ మిశ్రా, విశిష్ట అతిధులు డీఎంఎస్ (ఎలక్ట్రికల్) తాళ్ళపల్లి శ్రీనివాస్, డీడీఎంఎస్ బాలసుబ్రహ్మణ్యం ఇల్లందు ఏరియా జీఎం మల్లెల సుబ్బారావు, గుర్తింపు సంఘం ప్రతినిధి కె.కోటిరెడ్డి ఇల్లందు ఏరియాలో పనిచేసే వివిధ మైన్స్ అండ్ డిపార్ట్మెంట్లోని ప్రాజెక్టు అధికారులు, ఏరియా ఇంజనీర్, మేనేజర్లు, ప్రాజెక్ట్ ఇంజనీర్లు, గ్రూప్ ఇంజనీర్లు, రక్షణ అధికారులు, వర్క్ మెన్ ఇన్స్పెక్టర్లు, యూనియన్ నాయకులు, ఇతర అధికారులతో ఈ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ముందుగా అందరూ రక్షణ ప్రతిజ్ఞ నిర్వహించి, ఇటీవల చనిపోయిన వారికి 2నిముషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. సహజ మరణాలు నివారించడానికి తగిన చర్యలు, మైన్స్, డిపార్ట్మెంట్లో చట్ట ప్రకారం తీసుకోవాల్సిన రక్షణ పరమైన, ఆరోగ్య పరమైన, సంక్షేమ పరమయిన చర్యల గురించి గుర్తింపు సంఘం ప్రతినిధి, మైనింగ్ ఇన్స్పెక్టర్, సింగరేణి యాజమాన్యం సుధీర్ఘంగా పలు విషయాలు చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జిఎం బండి వెంకటయ్య, ఎజియం ప్రభాకరరావు, ప్రాజెక్టు అధికారులు పాల్గొన్నారు.