Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్లూరు
మండల పరిధిలోని ఇటీవల పలు కారణలతో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య ఆదివారం పరామర్శించి మృతుల చిత్రపటలకు పూలమాల లు వేసి నివాళి అర్పించారు. ఇటీవల మృతి చెందిన రిటైర్డ్ పోస్టు మాస్టర్ బత్తుల వెంకటేశ్వరరావు, వలసాల శ్రీనివాసరావు, సయ్యద్ దస్తగిరి (లాడెన్), వాచ్యానాయక్ తండా కు చెందిన బాణోత్ సువాలీ, ముచ్చారం పంచాయతీ, బాలాజీ నగర్ కు చెందిన పిల్లి భాగ్యమ్మ, ఓబులరావు బంజర్ గ్రామానికి చెందిన బొగ్గుల సీతమ్మ ల కుటుంబాలను వారి వారి నివాస గృహాలకు వెళ్లి, మృతుల చిత్రపటాలకు పూలమాలలుతో ఘన నివాళులర్పించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
రోడ్డు ప్రమాదంలో మతి చెందిన యువకులకు ఎమ్మెల్యే నివాళి
మండల పరిధిలోని చెన్నూరు గ్రామానికి చెందిన సొమ బత్తిని. ప్రవీణ్, జక్కుల. నాగభూషణం, శనివారం రాత్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వారి మృతదేహాలను పెనుబల్లి ప్రభుత్వాస్పత్రిలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సందర్శించి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చి కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు పంచాయతీ సర్పంచ్ పాలెపు లక్ష్మికాంతమ్మ, సొసైటీ చైర్మన్ పాలెపు రామారావు, జడ్పిటీసీ కట్టా అజరు కుమార్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ డాక్టర్ అక్కినేని రఘు, పసుమర్తి చందరావు, డీిసిసిబి డైరెక్టర్ బోబోలు లక్ష్మణ్ రావు, జడ్పీ కో ఆప్షన్ సభ్యులు ఎండి ఇస్మాయిల్, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి కొరకొప్పు ప్రసాద్, సర్పంచులు గంగవరపు శ్రీనివాసరావు, రావి సూర్యనారాయణ, భానోత్ రాణి రాందాస్, భూక్యా మాన్సింగ్, ఎంపీటీసీ సభ్యులు బానోత్ ఝాన్సీ కృష్ణ, వైకంటి పద్మావతి హరిబాబు, ఉప సర్పంచ్ షరాబు వెంకటేశ్వరరావు, సొసైటీ వైస్ చైర్మన్ రామిశెట్టి కొండలరావు, బత్తుల రమేష్, బొగ్గుల సత్యనారాయణ రెడ్డి, రాచమళ్ల నాగేశ్వరరావు, బత్తుల కిషోర్, పిల్లి నాగేశ్వరరావు, అజ్మీర జమలయ్య, ఖమ్మంపాటి రమేష్, వైకంటి శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ బానోత్ బాబు, మాజీ ఎంపీటీసీ సభ్యులు బానోతు సీతారాములు, సాదం రాజయ్య తదితరులు పాల్గొన్నారు.