Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మానహారం
నవతెలంగాణ-కారేపల్లి
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రయివేటీకరణను నిరసిస్తూ వీఎస్పీ అనుబంధ పరిశ్రమ మాధారం డోలమైట్ మైన్స్ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం కారేపల్లిలో మానహారం ఏర్పాటు చేశారు. ఎందరో త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కును బీజేపీ ప్రభుత్వం తెగనమ్మె ప్రయత్నం పై కార్మికులు కన్నెర చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి విశాఖ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయిస్యూనియన్(సీఐటియూ) కార్యదర్శి గుంపెనపల్లి నర్సింహరావు, మండల సీఐటీయు కార్యదర్శి కే.నరేంద్రలు మాట్లాడుతూ రూ.2లక్షల కోట్ల విలువైన ఉక్కు పరిశ్రమ ఆస్తులను కారుచౌకగా రూ.23135 కోట్లకు తెగనమ్మే కుట్రను ప్రజలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ 22 వేల ఎకరాల స్తిరాస్తి ఉందని వాటిని చేజిక్కుంచుకోవటానికి కార్పొరేట్ శక్తులు ఎత్తులు వేస్తున్నాయన్నారు. కార్పొరేట్ అధిపతుల కోసం మోడి ప్రభుత్వం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసి ప్రజా ఆస్తుల అప్పనంగా అప్పగించే ఏర్పాటు చేస్తుందని విమర్శించారు. ప్రయివేటీకరణ వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయిస్(సీఐటీయు) అధ్యక్షులు గుర్రం వెంకటేశ్వర్లు, నాయకులు మాలోత్ వీరన్న, కొమరం ప్రసాద్, జీ.వెంకటేశ్వర్లు, బీ.రాంబాబు, రమేష్ పాల్గొన్నారు.