Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూరపాటి
నవతెలంగాణ-బోనకల్
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, స్వర్గీయ నందమూరి తారక రామారావు తనయుడు తెలుగుదేశం పార్టీ ప్రచార రథసారథి మాజీ మంత్రివర్యులు, రాజ్యసభ సభ్యులు స్వర్గీయ నందమూరి హరికృష్ణ మూడో వర్ధంతిని మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హరికృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం టీడీపీ మండల అధ్యక్షుడు రావుట్ల సత్యనారాయణ అధ్యక్షతన సంస్మరణ సభ జరిగింది. ముఖ్య అతిథులుగా తెలంగాణ తెలుగుదేశం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మధిర నియోజకవర్గ ఇన్చార్జ్ వాసిరెడ్డి రామనాథం, ఖమ్మం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు కూరపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ హరికృష్ణ పార్టీకి చేసిన సేవలను కొనియాడారు. తదనంతరం బోనకల్లు గ్రామం లో ఖమ్మం జిల్లా పార్లమెంటరీరైతు అధ్యక్షులు నందమూరి సత్యనారాయణగారి బావ గుడిమళ్ల ఆదినారాయణగారి దశదిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి నాగండ్ల. మురళి జిల్లా ప్రధాన కార్యదర్శి గుత్తా. సీతయ్య, తెలుగుదేశం పార్టీ ఖమ్మం పార్లమెంటరీ రైతు అధ్యక్షులు నందమూరి సత్యనారాయణ, జిల్లా నాయకులు వడ్డెం. విజరు, ఖమ్మం జిల్లా తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి మైనేని రవికుమార్, రాష్ట్ర గిరిజన సంఘం కార్యదర్శి బానోతు శివలనాయక్, మండల ప్రధాన కార్యదర్శి మరీదు. బరకయ్య, బోనకల్ గ్రామ శాఖ అధ్యక్షులు గంగుల. శ్రీనివాసరావు, మండల కార్యదర్శి. బండి. రామరావు, మండల కోశాధికారి మండెపూడి. మోహనరావు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు యేసుపోగు. నాగేశ్వరరావు, రావినూతల గ్రామ కార్యదర్శి చితి రాల వెంకటేశ్వర్లు సీనియర్ నాయకులు, కొమ్మినేని సైదేశ్వర రావు పాల్గొన్నారు.