Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య కార్పొరేషన్ సాధన సమితి
నవతెలంగాణ-గాంధీచౌక్
ఆర్యవైశ్య కార్పొరేషన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని కోరుతూ ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య కార్పొరేషన్ సాధన సమితి ముఖ్యమంత్రి కే.సీ.ఆర్కు విజ్ఞప్తి చేస్తూ తీర్మానం చేసింది. ఆదివారం గాంధీ చౌక్‌లో ఉన్న వేములపల్లి వారి కళ్యాణ మండపంలో ఆర్యవైశ్య సంఘాల జిల్లాస్థాయి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న పలువురు వక్తలు మాట్లాడుతూ 2018 ఎన్నికలలో టి.ఆర్.ఎస్.పార్టీ ''ఆర్యవైశ్య కార్పొరేషన్'' ఏర్పాటు అంశాన్ని మ్యానిఫెస్టోలో పొందుపరచిన విషయాన్ని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కే.సీ.ఆర్ ''ఆర్యవైశ్య కార్పొరేషన్'' ఏర్పాటు చేస్తామని పలుమార్లు ప్రకటించిన విషయాన్ని తెలిపారు. పేద ఆర్యవైశ్యుల అభివృద్ధి సంక్షేమం కోసం ప్రకటించిన ''ఆర్యవైశ్య కార్పొరేషన్ ''ను పూర్తి చట్టబద్ధతతో వెయ్యి కోట్ల రూపాయల నిధులతో వెంటనే ప్రారంభించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైరా మాజీ మార్కెట్ చైర్మన్ వెంపటి రంగారావు, ఓసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు బుస్సా శ్రీనివాస్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మలిదశ ఉద్యమకారుడు, డోకిపర్తి సుబ్బారావు, ఖమ్మం జిల్లా రైతు సమన్వయ వేదిక కన్వీనర్ పసుమర్తి చందర్రావు, మాజీ కార్పొరేటర్ బాల గంగాధర తిలక్, వెల్లంపల్లి వెంకట సుబ్బారావు , సంక్షేమ సంఘ అధ్యక్షుడు సిద్ధంశెట్టి శ్రీకాంత్ పాల్గొన్నారు.