Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొణిజర్ల
రామనర్సయనగర్ గ్రామంలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా ఉంది. గ్రామంలో పారిశుధ్యంపై ప్రజాప్రతినిధులు అధికారులు దృష్ట్టి సారించకపోవడంతో అంతర్గత రహదారులకు ఇరువైపులా ప్లాస్టిక్ బాటిల్లు కొబ్బరి బోండాలతోపాటు ఇండ్లలో ఉన్న చెత్తాచెదారం ఏ అంతర్గత రహదారిని చూసిన ప్రత్యక్షంగా కనబడుతోంది. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు గ్రామాల్లో విచ్చలవిడిగా ప్రబలుతున్నాయి. గ్రామంలో సీజనల్ వ్యాధులు ప్రబలటానికి కారణం పారిశుధ్యం నిర్వహణ సక్రమంగా లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామాలు పరిశుభ్రంగా ఉండేలా ప్రతినెలా గ్రామపంచాయతీల ఖాతాల్లో డబ్బులు జమచేస్తుంది. ఇందుకుగాను సర్పంచ్ లు మల్టిపర్ఫస్ కార్మికులను నియమించుకొని ప్రతిరోజూ గ్రామంలో ఎక్కడ చెత్త లేకుండా మురికినీరు కనబడకుండా ఎప్పటికప్పుడు గ్రామపంచాయతీ ట్రాక్టర్ ద్వారా ఇంటింటికి తిరిగి తడిపొడి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకి తరలించి తడిపొడి చెత్తను వేరువేరుగా ఉంచాలి. కానీ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధులు అధికారులు పనిచేయడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. మంచినీళ్లు తాగే చేతిపంపుల వద్ద ఇంకుడు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయకపోవడం వల్ల తీసిన గుంతుల్లో నీళ్ళు నిల్వ ఉండటం వల్ల నీళ్లురంగుమారి దుర్వాసన వెదజల్లుతుండటమేకాక దోమలు వ్యాప్తికి కారణమవుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. ఎంతో చరిత్ర, చైతన్యం కలిగిన తామ గ్రామం అభివృద్ధిలో వెనకబడిపోతుందని పాలకుల నిర్లక్ష్యం కారణంగా తామ గ్రామం అభివృద్ధికి నోచుకోలేకపోతుందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ఇకపోతే ప్రతి ఇంట్లో మరుగుదొడ్లు ఉన్నప్పటికీ మరుగుదొడ్లు వినియోగించుకునేలా స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజలకు ఆవగాహన కల్పించకపోవడంతో బహిరంగ మలమూత్ర విసర్జనకు రహదారుల వైపు వెళుతున్నారు. దీంతో గ్రామంలోకి అడుగుపెట్టాగానే దుర్వాసన వెదజల్లుతోంది. ఇకనైనా జిల్లా ఉన్నతాధికారులు తామ గ్రామాన్ని సందర్శించి గ్రామాభివృద్ధికి సహకరించి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా అధికారులు ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.