Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పద్మశాలీ సంఘం అధ్యక్షుడు కమర్తపు మురళీ
నవతెలంగాణ-గాంధీచౌక్
పద్మశాలీలు రాజకీయంగా రాణించాలని, ఆర్థికంగా ఉన్నతంగా ఎదగాలని పద్మశాలీ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు కమర్తపు మురళీ అన్నారు. ఆదివారం ఖమ్మం నగరంలోని ఐఎంఏ హాల్లో ఖమ్మం జిల్లా పద్మశాలి ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం ఖమ్మం జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఖమ్మం నగర టీిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మరియు 24వ డివిజన్ కార్పొరేటర్ కమర్తపు మురళీని , ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్బాబు గౌరవ అధ్యక్షులుగా బొమ్మ రాజేశ్వరరావుని , వర్కింగ్ ప్రెసిడెంట్ గా జెల్ల లక్ష్మినారాయణని , వైస్ ప్రెసిడెంట్ గా జెల్లవెంకటేశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అంతకు ముందు సమావేశాన్ని ఉద్దేశించి కమర్తపు మురళీ మాట్లాడుతూ పద్మశాలీలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామన్నారు. గ్రామ, మండల, నియోజకవర్గాల వారీగా కమిటీలు వేస్తామన్నారు. కమిటీలలో యువతకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. పద్మశాలీ వైద్యులు మనకు తక్కువ ఆశించే వైద్యం చేయటానికి రెడీగా ఉన్నారన్నారు. పద్మశాలీ సంఘం జిల్లా ఉద్యోగ విభాగం అధ్యక్ష కార్యదర్శులుగా రచ్చ శ్రీనివాస్, పారుపల్లి సత్యనారాయణ, ఖమ్మం పద్మశాలి నియోజకవర్గ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు పెండెం జనార్ధన్, దేవరశెట్టి సత్యనారాయణ, జిల్లా పద్మశాలి మహిళా కమిటీ అధ్యక్ష కార్యదర్శులు గడ్డం సునీత, ఇంజమూరి సంధ్యారాణి, పద్మశాలీ రిట్కెర్డు జిల్లా కమిటీని అధ్యక్ష కార్యదర్శులుగా దుస్స సత్యనారాయణ పాల్గొన్నారు.