Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చండ్రుగొండ
మండలంలోని తుంగారం గ్రామపంచాయతీలోని కొమ్ముల గూడెం గ్రామంలో అప్పీల్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పదవ తరగతిలోపు పేద విద్యార్థుల కోసం స్టడీ సర్కిల్‌ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు గోళ్ళ రమేష్ మాట్లాడుతూ పేదలు ఈ దేశంలో పేదల, బడుగు బలహీన వర్గాల వారు అభివృద్ధి చెందడానికి ఉన్న ఏకైక మార్గం విద్య అని ఆ విద్య ద్వారానే సమాజంలో ప్రశ్నించే తత్వం అలవడుతుందని తద్వారా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందనే ఆలోచనతో జిల్లావ్యాప్తంగా స్టడీ సర్కిల్స్‌ను ఏర్పాటు చేసి వాలంటరీగా ముందుకు వచ్చే చదువుకున్న యువతీ యువకుల ద్వారా పదవ తరగతి పిల్లలకు ట్యూషన్లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బానోత్ పార్వతి, సర్పంచ్ బానోత్ కుమారి, జిల్లా బీసీ సంఘం అధ్యక్షుడు భూపతి శ్రీనివాసరావు, వైస్ సర్పంచ్ మంగయ్య పాల్గొని తమ వంతు సహకారాన్ని అందిస్తామని తెలిపారు. 20 రకాల వస్తువులను ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో అప్పీల్ స్వచ్ఛంద సంస్థ వర్కింగ్ ప్రెసిడెంట్, సింగరేణి డీజీఎం ఫైనాన్స్ శ్రీ ఈ బీభత్స, సింగరేణి డీజీఎం ఫారెస్ట్రీ శ్రీ భానోత్ కర్ణ, జాయింట్ సెక్రెటరీ, సింగరేణి కెమిస్ట్ శ్రీ రవి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.