Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఐఎంఏ రాష్ట్ర 11వ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే వనమా
నవతెలంగాణ-కొత్తగూడెం
డాక్టర్లు సేవా దృక్పదంతో పనిచేయాలని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం ఐఎంఏ రాష్ట్ర 11వ వర్కింగ్ కమిటీ సవేశాన్ని ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనతరం ఆయన మాట్లాడారు. సామాన్య ప్రజానికానికి కార్పొరేట్ వైద్యం అందినప్పడే వారి ఆరోగ్యం బాగుంటుందని, కమర్షియల్గా కాకుండా సేవా దృక్పదంతో వైద్య సేవలు అందించాలని కోరారు. డాక్టర్ అంటే దేవుడుతో సమానం భావిస్తారని, సమాజ నిర్మాణం కోసం డాక్టర్లు చేస్తున్న కృషి ఎంతగానో అభినందించదగ్గ విషయమని, ప్రతి ఒక డాక్టర్ పేదలకు వైద్యం అందుబాటులో ఉండేలా చూడాలి కోరారు. ఈ సమావేశంలో ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ లవ కుమార్ రెడ్డి, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ ఇ.రవీందర్ రెడ్డి, ప్రెసిడెంట్ లు డాక్టర్ సంపత్ రావు, డాక్టర్ బిఎన్రావు, సెక్రెటరీ డాక్టర్ నరేందర్ రెడ్డి, సెంట్రల్ వర్కింగ్ నెంబర్ డాక్టర్ విజరు కుమార్, డాక్టర్ కృష్ణ ప్రసాద్, స్థానిక వైద్యులు, ఐఎంఏ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.