Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కె.బ్రహ్మచారి
నవతెలంగాణ-చర్ల
చర్లలో నూతనంగా నిర్మించనున్న ఏకలవ్య పాఠశాలకు కేవలం అధికారులే కారణమని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కె.బ్రహ్మచారి విమర్శించారు. ఆదివారం విజయ కాలనీ ఆదివాసీల పోడు భూమిని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కార్యదర్శి కొండా చరణ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారులు ఏకలవ్య పాఠశాల వంకతో నిరుపేద ఆదివాసీల పోడు భూములను గుంజుకోవాలని చూస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఏకలవ్య పాఠశాలకు సీపీఐ(ఎం) వ్యతిరేకమని జీఎస్పీ నాయకుడు పాయం సత్యనారాయణ, ఇతర గిరిజన సంఘాలు చేస్తున్నా తప్పుడు ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ భూముల్లో ఏకలవ్య పాఠశాల నిర్మాణం చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ స్థలంలోనే ఏకలవ్య పాఠశాల నిర్మాణం చేపట్టే విధంగా పోరాటం చేస్తామని ఆయన తెలిపారు. పాఠశాల నిర్మాణానికి అధికారులు ప్రభుత్వ భూమిని చూపించలేక పోయారు కానీ బృహత్తర పల్లె ప్రకృతి కోసం భూమిని ఎలా చూపించారని ఆయన ప్రశ్నించారు. బృహత్తర పల్లె ప్రకృతి కేటాయించిన ప్రభుత్వ భూమి పక్కనే నాయకుల కాలనీ, ప్రభుత్వ జూనియర్ కళాశాల మధ్యన సుమారు 40 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, ఆ స్థలంలో ఏకలవ్య పాఠశాలకు 20 ఎకరాలు కేటాయించవచ్చని ఆయన సూచించారు. మండల కేంద్రంలో ప్రభుత్వ భూమి ఎంత ఉందో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించి నిజనిర్ధారణ చేయాలన్నారు. నాడు హక్కు పత్రాలు ఇచ్చి, నేడు భూమిని పుంజుకోవడం దుర్మార్గమైన చర్య అన్నారు. వాస్తవాలను గుర్తించకుండా గిరిజన సంఘాలు పార్టీని విమర్శించడం సరికాదన్నారు. మండల కేంద్రంలో ఏకలవ్య పాఠశాల నిర్మాణం కోసం పార్టీ చేస్తున్న పోరాటాలలో గిరిజన సంఘాలు పాల్గొని పోరాటాలను ఉధృతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఆదివాసీల పోరాటానికి సీపీఎమ్ఎల్న్యూడెమోక్రసీ మద్దతు
తమ పట్టా భూములను లాక్కోవద్దని విజరు కాలనీవాసుల చేస్తున్న భూపోరాటంకు ఆదివారం సీపీయంఎల్ న్యూ డ్రమకెసి పార్టీ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ నిరుపేదల కోడు భూములను ప్రభుత్వ అధికారులు కాజేసే విధానం సరికాదని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు చింతూరు రజనీకాంత్, శ్యామల వెంకట్, బందెల చంటి, వరలక్ష్మి, పి.సమ్మక్క, వార్డు సభ్యులు సంతోష్, మాలచ్చు, వెంకటేశ్వర్లు, పెద్ద ఎత్తున పోడు సాగుదారులు తదితరులు ఉన్నారు.