Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ డీఓ ఆకుల బాలక్రిష్ణ
నవతెలంగాణ-అశ్వారావుపేట
ఈ ఏడాది ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు ముమ్మరంగా పామ్ ఆయిల్ మొక్కలు పంపిణీ చేస్తున్నారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో ఆయిల్‌ఫెడ్ 5 వేలు ఎకరాలు విస్తరించడానికి లక్ష్యంగా పెట్టుకోగా ఈ నెల (అగస్టు) 18 నాటికి 2751 మంది ఔత్సాహిక రైతులు 11506 ఎకరాలకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకోసం 6 లక్షల మొక్కలు ప్రస్తుతానికి సిద్దంగా ఉన్నాయి. ఈ క్రమంలో నూతనంగా సాగుచేసే రైతులే అధిక మొత్తంలో ఉన్నారు. అందుకోసం మొక్కలు నాటడంలో మెలుకువలును నవతెలంగాణ ద్వారా ఆయిల్ ఫెడ్ డివిజనల్ మేనేజర్, అశ్వారావుపేట కర్మాగారం మేనేజర్ ఆకుల బాలక్రిష్ణ తెలిపే క్రమం.
నాటు సమయం : అన్ని కాలాల్లోనూ పామ్ ఆయిల్ మొక్కలు నాటవచ్చు కానీ వర్షాకాలం బాగా అనుకూలమైనది. వేసవి కాలంలో నాటేటట్లైతే మొక్కలు వేసవి తాపాన్ని తట్టుకోవడానికి సమృద్దిగా సాగు నీరు అందించాలి. మల్చింగ్, మొక్క పాదు చుట్టూ (1.5 మీ దూరం వరకు), రెండు మూడు వరుసల్లో జనుము నాటితే మొక్కలను వేడిగాలులు నుండి కాపాడవచ్చు.
మొక్కలు సంఖ్య : హెక్టారుకు 143 లేదా ఎకరానికి 57 మొక్కలు నాటాలి.
మొక్కలు మధ్య దూరం : మొక్కకూ మొక్కకు మధ్య దూరం 09 మీ ఐ 09 మీ ఐ 09 మీ మేర సమ త్రికోణ పద్ధతిలో నాటాలి.
గుం(ట)త లేక గొయ్యి సైజు : 60 సె.మీ ఐ 60 సె.మీ ఐ 60 సెంటీమీటర్లు (పొడవు బీ వెడల్పు : లోతు) గుంటలోనాటుకోవాలి.
నాటే విధానం : నాటుటకు ముందు గుంటలు తీసి సిద్దంగా ఉంచుకోవాలి. నాటే సమయంలో గానీ ముందు రోజు గానీ మొక్కలను నర్సరీ నుండి వ్యవసాయ క్షేత్రానికి తరలించాలి. ప్రతీ గుంట అడుగు భాగంలో 400 గ్రాములు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 50 గ్రాములు ఫొరేట్ గుళికలు వేసి మట్టితో కలపాలి. మొక్క పెంచడానికి ఉపయోగించిన పాలీథీన్ సంచిని నిలువుగా చీల్చి, ఆ మట్టితో సహా మొక్కను గుంటలో నాటాలి. నాటిన వెంటనే మొక్క చుట్టూ పాదులను చేసి మొక్కలకు నీరు పెట్టాలి. మొక్క తల భాగము లేక చిగుర్లు మట్టితో పూడుకొనకుండా జాగ్రత్తలు పాటించాలి.
పై విధంగా చేసినట్లైతే నాటిన ప్రతీ మొక్క బతికే అవకాశం ఉంటుంది. రండో ఏడాది మనేదు (చావు) మొక్కలు పెట్టే అవకాశం లేకుండా ఉంటుంది.