Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ జిల్లా స్పోర్ట్స్ అధికారి ఉదయ్ కుమార్
అ హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్
నవతెలంగాణ-కొత్తగూడెం
హాకీ క్రీడా మన జాతీయ క్రీడ కావడం, హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ జన్మదినం రోజున జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకోవడం మన అదృష్టమని జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్ ఉదరు కుమార్ అన్నారు. జిల్లా కొత్తగూ డెం హౌటల్ శ్రీకృష్ణ ఇన్లో జరిగిన జాతీయ క్రీడా దినోత్సవంలో జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్ పాల్గొని ప్రసంగించారు. జాతీయ క్రీడ అయిన హాకీ క్రీడను దాదాపు రాష్ట్రంలో మరిచిపోతున్న వేళ కోచ్ ఇమామ్ భద్రాద్రి కొత్తగూడెం అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని వందలాది మంది హాకీ క్రీడాకారులను తయారుచేయడం గొప్పవిషయంమన్నారు. అనంతరం క్రీడా దినోత్సవం కేకును కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో హాకీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వాసు, ఉమ్మడి ఖమ్మం జిల్లా హాకీ సెక్రెటరీ బట్టు ప్రేమ్ కుమార్, కొత్తగూడెం హాకీ క్లబ్ అధ్యక్షుడు ఉదరు కుమార్, సీనియర్ కోచ్ సలీం, జిల్లా హాకీ కోచ్ ఇమామ్, స్పోర్ట్స్ ఆఫీసర్ లక్ష్మణ్, సీనియర్ క్రీడాకారులు హాకీ క్రీడాకారులు పాల్గొన్నారు.