Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ బహుజన ఐక్యవేదిక నాయకులు
నవతెలంగాణ-కొత్తగూడెం
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, ఆయన తనయుడు వనమా రాఘవేంద్రారావు బహుజనుల మధ్య చిచ్చుపెట్టే చర్యలను మానుకోవాలని బహుజన ఐక్యవేదిక నాయకులు హితవు పలికారు. ఆదివారం బహుజనుల ఐక్యవేదిక పట్టణంలో వారి విధానాలు నిరసిస్తు ప్రదర్శన నిర్వహించారు. శనివారం కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్లో ఏర్పాటుచేసిన డాక్టర్ బిఆర్.అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా అధికార పార్టీ నాయకులు వ్యవహరించిన తీరుకు నిరసనగా రైల్వే స్టేషన్ నుంచి ర్యాలీగా సూపర్ బజార్ నుండి బస్టాండ్ మీదుగా పోస్ట్ ఆఫీస్ అంబేద్కర్ సెంటర్‌కు చేరుకొని అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావును అంబేద్కర్ సాక్షిగా ప్రోటోకాల్ పాటించకుండా అవమానించడాన్ని తీవ్రంగా ఖండిచారు. ఈ కార్యక్రమంలో బహుజన నాయకులు జెబీ.శౌరి, యెర్రా కామేష్, సలిగంటి శ్రీనివాస్, మరపాక రమేష్, కరిష రత్నకుమారి, చదలవాడ.సూరి, నీలా, బలగం.శ్రీధర్, గిరిజన నాయకులు పాల్గొన్నారు.
గుండాల ప్రభుత్వ విప్, పినపాక నియోజకవర్గ ఆదివాసీ ఎమ్మెల్యే రేగా కాంతారావును జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ప్రొటోకాల్ పాటించకుండా, అవమాన పరచడాన్ని తుడుందెబ్బ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఆదివాసీ హక్కుల పోరాట సమితి(తుడుందెబ్బ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుంపిడి వెంకటేశ్వర్లు చెప్పారు. ఈ విషయమై ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఆదివాసీ ముద్దుబిడ్డ రేగా కాంతారావుకు జరిగిన అవమానంపై తుడుందెబ్బ ఆధ్వర్యంలో (నేడు) సోమవారం కలెక్టర్‌ను కలిసి మెమోరాండం ఇవ్వనున్నట్లు తెలిపారు.
పినపాక : కొత్తగూడెంలో జరిగిన సమావేశంలో ఆదివాసీ, ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావుకు ప్రోటోకాల్ పాటించకుండా అవమానపరచడం బాధాకరమని ఎంపీటీసీల సంఘం ఉపాధ్యక్షులు కాయం శేఖర్ అన్నారు. ఆయన ఈ బయ్యారం క్రాస్ రోడ్లో జరిగిన సమావేశంలో మాట్లాడారు. ఆదివాసీ సమాజం పరంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.
పినపాక ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావుని ప్రోటోకాల్ విషయంలో అవమానపరిచిన అధికార పార్టీ నిర్వాహకులు, జిల్లా అధికార యంత్రాంగం వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేనియెడల భద్రాద్రి కొత్తగూడెంలో గల అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, వనమా ఇల్లు... అన్ని ఆదివాసీ సంఘాలు, రేగ కాంతారావు అభిమానులతో ముట్టడిని చేస్తాం అని ఆదివాసీ ఐక్య వేదిక నాయకులు తొలెం శ్రీను హెచ్చరించారు. ఆదివారం మండలం బయ్యారంలో జరిగిన సంఘ అత్యవసర సమావేశంలో మాట్లాడారు. శనివారం జరిగిన సంఘటన నిలువెత్తు సాక్ష్యం అని, ఒక విప్ హౌదాలో ఉన్న ఆదివాసీ ఇలా అవమానించడం తీవ్ర అభ్యంతరకరం అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం అధ్యక్షులు కార్యదర్శులు నరసింహారావు, మహేష్, బయ్యారం సర్పంచ్ కోరం రజిని, తెలంగాణ జెన్కో ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిద్దుల హుస్సేన్, కోరం జంపయ్య, మండలం ఎస్సీ సెల్ అధ్యక్షులు నాగభూషణం, అశోక్, విజరు, భాను, తదితరులు పాల్గొన్నారు.