Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఐద్వా జిల్లా అధ్యక్షురాలు రేణుక
నవతెలంగాణ-భద్రాచలం
అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) పట్టణ కమిటీ సమావేశం టౌన్ అధ్యక్షురాలు డి.సీతాలక్ష్మి అధ్యక్షతన ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు మర్లపాటి రేణుక మాట్లాడుతూ భద్రాచలం పట్టణంలో డబల్ బెడ్ రూమ్ ఇల్లు పూర్తి అయ్యి చాలా కాలం అయిందని అన్నారు. ఇంతవరకూ అర్హులకు కేటాయించకుండా జాప్యం చేయడం వలన ఆ ఇల్లు శిథిలావస్థలోకి పోతున్నాయని విమర్శించారు. వాటిని వెంటనే శుభ్రం చేసి అర్హులైన పేదలకు కేటాయించాలని ఆమె డిమాండ్ చేశారు. పట్టణంలో ఆరు వేల కుటుంబాలకు పైగా పేదలు ఇల్లు లేక అద్దె ఇళ్లల్లో ఇబ్బందులు పడుతూ జీవిస్తున్నారని పేర్కొన్నారు. ఇన్ని సంవత్సరాల కాలంలో కేవలం 80 కుటుంబాలకు మాత్రమే డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి మిగతా వారీ గురించి పట్టించుకోకుండా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. కరోనా కష్టకాలంలో ఉపాధి కోల్పోవడంతో జీవించడమే కష్టంగా మారిన ఈ సమయంలో ఇంటి అద్దెలు కట్టలేక పేదలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే అందరికీ ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఉస్తెల జ్యోతి, జి.జీవనజ్యోతి, ఏ.సక్కుబారు, సిహెచ్ వెంకట రమణ, సుశీల, తదితరులు పాల్గొన్నారు.