Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ పార్టీ కోసం పనిచేయాలని సూచించిన కేటీఆర్
అ రానున్న కమిటీల్లో ఉద్యమకారులకు అవకాశం
నవతెలంగాణ-కొత్తగూడెం
రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను కొత్తగూడెంకు చెందిన ప్రముఖ విద్యావేత్త, జిల్లా టీఆర్ఎస్ నాయకులు జెవిఎస్ చౌదరి శనివారం రాత్రి కలిశారు. ఈ సందర్భంగా జేవీఎస్‌తో ఆత్మీయంగా కేటీఆర్ ముచ్చటించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేటీఆర్‌తో కలిసి పనిచేసిన సందర్భంగా జేవీఎస్‌తో కేటీఆర్‌కు ప్రత్యేకమైన అనుబందం ఉంది. ఈ నేపథ్యంలోనే జేవీఎస్‌తో కేటీఆర్ ఆత్మీయంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో రాజకీయాలపై చర్చ సాగింది. కొత్తగూడెం నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి కష్టపడి పనిచేయాలని ఈ సందర్భంగా కేటీఆర్ సూచించారు. ఉద్యమకారులకు, టీఆర్ఎస్కు ఆది నుంచి వెన్నుదన్నుగా ఉన్న కార్యకర్తలకు మంచి భవిష్యత్ అందిస్తామని కేటీఆర్ హామీ ఇవ్వడం పట్ల జేవీఎస్ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.