Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఫారెస్ట్, పోలీస్ ఆటలు సాగనివ్వం
అ పోరాటంతోనే పోడు భూమిని
రక్షించుకుంటాం
అ సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు
కాసాని అయిలయ్య
నవతెలంగాణ-చండ్రుగొండ
పచ్చదనం పర్యావరణం పేరుతో పంటలను ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు, ఫారెస్ట్, పోలీస్ ఆటలు సాగనివ్వమని, పోరాటాల ద్వారానే పోడు భూముల రక్షించు కుంటామని, గిరిజన పోడు సాగు దారులకు అండగా ఉంటామని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కాసాని అయిలయ్య పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని సీతయ్య గూడెంలో ఫారెస్టు అధికారులు ధ్వంసం చేసిన పంటలను వారు పార్టీ బృందంతో పరిశీలించారు. ఈ సందర్భంగా కాసాని మాట్లాడారు. గత అనేక సంవత్సరాల నుండి చెట్టు పుట్ట కొట్టుకొని పోడు భూమి సాగు చేసుకుని, పంట పండించుకొని, బిడ్డలను చదివించుకుంటూ జీవనం సాగిస్తూ, దేశానికి అన్నం పెడుతున్న గిరిజన రైతులపంటలను ధ్వంసం చేసి వారిని, గిరిజన మహిళలను అని చూడకుండా చితకబాదడం బాధాకరమన్నారు. దీనిని ప్రజలు అందరూ ఖండించాలన్నారు. దెబ్బలు తాళలేక రవి, రాము పురుగు మందు తాగితే ప్రధానంగా ఎస్సై, ఫారెస్ట్ వారు యాక్షన్ చేస్తున్నారని అసభ్య పదజాలంతో దూషించి, మోకాళ్ళతో 25 మందిపై దాడి చేసి భయానికి వాతావరణం సృష్టించడం హేయమైన చర్యఅన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ పోడు భూములు వదులుకునే పరిస్థితి లేదన్నారు. జిల్లాలో పోడు సాగుదారులను సమీకరించి, పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగిస్తామ న్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు కేసీఆర్ పట్టాలు ఇస్తామని చెప్పి ఎదిగిన పంటలను ధ్వంసం చేయడం సరైంది కాదన్నారు. ఓట్లు వచ్చినప్పుడు డబ్బులు ఇస్తే ఓట్లు వేస్తారు అనే భ్రమలో కేసీఆర్ ఉన్నార న్నారు. దీనిని తిప్పి కట్టవలసిన పరిస్థితి మనందరిపై ఉందన్నారు. ఆనాడు పోరాటం ద్వారానే తెలంగాణ నుంచి నైజాం నవాబును తరిమికొట్టాన్నారు. ఇప్పుడు భూమి సాధించుకోవాలంటే జైలుకు వెళ్లడానికి అయినా సిద్ధంగా ఉండాలని సాగుదారులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, జిల్లా కమిటీ సభ్యులు కొండ పల్లి శ్రీధర్, జాటోత్ కృష్ణ, అన్నవరం సత్యనా రాయణ, మండల కార్యదర్శి యాస నరేష్, మండల కమిటీ సభ్యులు రామిరెడ్డి, విప్పర్ల పెద్ద వెంకటేశ్వర్లు, పోడు సాగు దారులు తదితరులు పాల్గొన్నారు.