Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని సివిల్ సప్లై చైర్మెన్ మా రెడ్డి శ్రీనివాస్ రెడ్డి దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. రామాలయానికి విచ్చేసిన వారికి ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ముందుగా ధ్వజస్తంభం వద్ద నమస్కరించుకుని అంతర లయంలోని మూల మూర్తులకు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని లక్ష్మీ తాయారమ్మ వారిని ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట దేవస్థానం ఈవో బానోతు శివాజీ, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
సాయి మందిరంలో మాది రెడ్డి శ్రీనివాస్ రెడ్డి పూజలు
భద్రాచలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సెంటర్లోని సాయినాధుని మందిరాన్ని తెలంగాణ స్టేట్ సివిల్ సప్లై చైర్మన్ మాది రెడ్డి శ్రీనివాసరెడ్డి కుటుంబ సమేతంగా ఆదివారం సందర్శించారు. ఆలయంలోనికి విచ్చేసిన ఆయనను ఆలయ సభ్యులు స్వాగతం పలికారు. బాబా చుట్టూ ప్రదక్షిణ చేశారు. అనంతరం అర్చకులు వారి పేరున అష్టోత్తర నామార్చన జరిపారు. ఆశీర్వచనం చేశారు. ఆలయ సభ్యులు ఆయనను శాలువా, పూలమాలతో సత్కరించారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
దుమ్ముగూడెం : ప్రముఖ పుణ్యక్షేత్రమైన పర్ణశాల రామయ్య తెలంగాణ సివిల్ సప్లై చైర్మన్ మా రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ సిబ్బంది వారికి ఆలయ మర్యాదల ప్రకారం ప్రధాన దూరంలో ప్రత్యేక స్వాగతం పలికి గర్భాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు సీత కుటీర ప్రదేశంతో పాటు, నారా చీరల ప్రాంతాలను సందర్శించి పర్ణశాల విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఆలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.