Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ మన్యంలో ఇంటింటా విషజ్వరాలు
అ రోజు రోజుకు పెరుగుతున్న మరణాలు
అ 24 గంటలు వైద్యం అందించాలి
అ అఖిలపక్షం ఆధ్వర్యలో
దశల వారి ఆందోళనలు
నవతెలంగాణ-మణుగూరు
మణుగూరు సబ్ డివిజన్లో ఆదీవాసులు జీవనం కొనసాగిస్తున్న మన్యంలో, ఆధునీక వసతులు కలిగిన పట్టణాలలో ఇంటింటా విష జ్వరాలతో ప్రజలు భాధపడుతున్నారని, వెంటనే వంద పడకల ఆసుపత్రిలో వైద్యులు నియమించి 24 గంటలు ప్రజలకు సేవలందించాలని అఖిలపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక వంద పడకల ఆసుపత్రి ఎదుట సుమారు మూడు గంటల పాటు ధర్నా నిర్వహించారు. రోజుకు సగటున రెండు నుంచి ఐదుగురి వరకు మృత్యువాతకు గురి అవుతున్నారని ఆరోపించారు. కరోనాతో విజయం సాధించినప్పటికీ డెంగ్యూ, ఇతర విషజ్వరాలు ప్రజలను ఊపిరి పీల్చుకోకుండా చేస్తూ వైద్యం అందినా, అందకపోయినా మృత్యువాతకు గురి అవుతున్నారన్నారు. పినపాక నియోజకవర్గం అయిన మణుగూరులో వంద పడకల ఆసుపత్రి నిర్మించి యేడేండ్లు అయిన ఇంతవరకు సరైన వైద్య సౌకర్యాలు, వైద్యులను నియమించకపోవడం వలన సామాన్య ప్రజలకు వైద్యం అందడం లేదన్నారు. వెంటనే వంద పడకల ఆసుపత్రిలో వైద్యులు నియమించి 24 గంటలు వైద్య సౌకర్యాలు అందించి ప్రజల ప్రాణాలను కాపాడాలని నాయకులు అందోలన వ్యక్తం చేశారు. విషజ్వరాలతో రోజు రోజుకు మరణాలు పెరుగుతున్నాయని మణు గూరులో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించా లని, ప్రతి గ్రామంలో వైద్య శిబిరాలు నిర్వహించి ప్రజల ప్రాణాలను కాపాడాల న్నారు. లేని పక్షంలో సెప్టెంబర్ 1వ తేదీన తహాసీల్దార్ కార్యాలయం ముట్టడి, 4వ తేదీన మణుగూరు సబ్‌డివిజన్ బంద్, 6వ తేదీన మణుగూరును నిర్బంధిస్తా మని హెచ్చరించారు. గతంలో ప్రతి పక్ష నాయకుడుగా ఉన్నా నేటి ప్రభుత్వ విప్ రేగా కాంతారావు హాయాంలో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించా మన్నారు. ప్రజలు మరణిస్తున్న ఎమ్మెల్యే, ఎంపీలు పట్టించుకోరా అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బొల్లోజు అయోధ్యచారి, తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు వట్టం నారాయణదొర, సీపీఐ(ఎం) జిల్లా కమీటి సభ్యులు నిమ్మల వెంకన్న, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు పొన్నం భిక్షపతి, ఎన్డీ నాయకులు మధుసూధన్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్ష నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.