Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ రాత్రికి రాత్రే పంచాయతీ పనులు
నవతెలంగాణ-అన్నపురెడ్డిపల్లి
మండల పరిధిలోని అబ్బుగూడెం గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్యం పనులు గత కొంతకాలంగా జరగడం లేదని గ్రామ పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యంతో పారిశుధ్యం లోపం జరిగి విష జ్వరాలు బారిన ప్రజలు పడుతున్నారని పలువురు గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో గత నెలలో కలెక్టర్ పర్యటన సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రతి వారానికి ఓ సారి వాటర్ ట్యాంక్ బ్లీచింగ్తో క్లిన్ చేయాలి అని చూసించినా ఇంత వరకు క్లినింగ్ చేయలేదని, అదేవిధంగా గ్రామంలో బ్లీచింగ్ చల్లడంగాని, గ్రామంలో చేస్తున్న పనులు ఆదాయా అభివృద్ధి కార్యక్రమాలు వివరాలు కూడా పంచాయతీ కార్యాలయంలో నోటీస్ బోర్డులో పెట్టడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.