Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ పరీక్షలను పర్యవేక్షించిన సింగరేణి డైరెక్టర్ పా బలరామ్
నవతెలంగాణ-కొత్తగూడెం
సింగరేణి సంస్థలో ఉన్న జూనియర్ స్టాఫ్ నర్స్ పోస్టులకు ఆదివారం జరిగిన రాత పరీక్షల ప్రశాంతంగా ముగిసింది. సంస్థలో ఖాళీగా ఉన్న 84 జూనియర్ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు వేలాది మంది దరఖాస్తులు చేసుకున్నారు. మొత్తం 11113 మంది ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో అర్హులైన11140 మంది అభ్యర్థులకు సంస్థ హాల్టికేట్స్ జారీ చేసింది. పరీక్షల నిర్వహణకు పాల్వంచ, కొత్తగూడెం పట్టణాలలో 8 సెంటర్స్ ఏర్పాటు చేశారు. 7666 మంది మాత్రమే పరీక్షలకు హాజరయ్యారు. కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షల ఫలితాలను అదేరోజు సింగరేణి వెబ్సైట్లో ఉంచారు. పరీక్షల నిర్వహన, ఏర్పాట్లను సింగరేణి డైరెక్టర్ పా ఎన్.బలరామ్ పర్వవేక్షించారు. ఆయన వెంట జీఎం పర్సనల్ అందెల ఆనందరావు, జీఎం సెక్యూరిటీ ఏ.కుమార్ రెడ్డి, జీఎం విజిలెన్స్ వి.చంద్రశేఖర్, జీఎంలు వెంకటేశ్వర రెడ్డి, నాగభూషణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.