Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మండలంలో చెరువుల వివరాలు
మండలంలో 90 చెరువులు ఉన్నట్లు మత్యశాఖ గుర్తించినది. వాటిలో 89 స్వల్పకాలిక చెరువులుగాను సుబ్లేడు పెద్ద చెరువును దీర్ఘకాలిక చెరువుగా తేల్చారు. వాటి విస్తీర్ణం 415 హెక్టార్లు వాటిలో సుబ్లేడు పెద్ద చెరువు 170 హెక్టార్లు. వీటి నీటి విస్తీర్ణం 750 హెక్టార్లుగా తెలిపారు.
మండలంలో సొసైటీల వివరాలు
మండలంలో 40 గ్రామపంచాయతీలు మరో 36 ఆమ్లెట్ గ్రామాలు కలిపి 76 గ్రామాలు ఉన్నాయి. వీటిలో తిరుమలాయపాలెం, బీరోలు, బచ్చోడు, సుబ్లేడు, కాకరవాయి, జల్లేపల్లి, మేడిదపల్లి, జూపెడ, పాతర్లపాడు, తెట్టెలపాడు, వెదుల్లచెరువు 11 గ్రామాలలో మాత్రమే మత్స్యసహకార సొసైటీలు ఉన్నాయి. మిగిలిన గ్రామాల్లో మత్స్యకారులు ఉన్నప్పటికీ సొసైటీలు లేక అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు.
చేపల పంపిణీ వివరాలు
2020 సంవత్సరం 89 చెరువులలో 15లక్షల 31 వేల 8 వందల చేపపిల్లలను పంపిణీ చేసినట్లు లెక్కలు చూపిస్తున్నారు. అందులో సుబ్లేడు పెద్ద చెరువులో 2 లక్షల 55 వేల చేపపిల్లలను పోసారాట. ఈ లెక్కన పోసిన చేపలలో 70 శాతం పిల్లలు బ్రతి పెద్దవి ఐతే సుమారు 11 లక్షల చేపలు ఒక చేప ఒక కేజీ సైజు వచ్చిన 1లక్షా 10వేల టన్నుల చేపల దిగుబడి వస్తుంది. కేజీ రూ 100 చొప్పున అమ్మితే సుమారు 11 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది. మరి ఈ డబ్బులు మత్స్యకారులకు వచ్చాయా పై చేప పిల్లల లెక్కలు కరెక్టేనా?. 2021 సంవత్సరం చేప పిల్లల చిన్న పెద్ద సైజు కలిపి మొత్తం 21 లక్షల 22 వేల 500 పంపిణీ చేయుటకు ప్రణాళిక చేయగా ప్రస్తుతం 29 చెరువులలో చిన్న సైజు చేప పిల్లలు 6 లక్షల 68 వేలు పంపిణీ చేసినట్లు తెలిపారు. మిగతా అరవై ఒక్క చెరువులకు గాను 14 లక్షల 54 వేల చేప పిల్లలను పంపిణీ చేయాల్సి ఉందని మత్స్యశాఖ వారు తెలిపారు.
పొంతనలేని సొసైటీ సభ్యుల వివరాలు
మండలంలోని 12 సొసైటీల వివరాలు పిషరీష్ డెవలప్ మెంట్ ఆఫీస్ (ఎఫ్డిఓ) ఇచ్చిన వివరాలకు జిల్లా మత్స్య శాఖ అధికారులు తెలిపిన వివరాలు పొంతన లేకుండా ఉన్నాయి. ఎఫ్డీఓ ఇచ్చిన వివరాలు సొసైటీల వారిగా తిరుమలాయపాలెం 17, బీరోలు74, బచ్చోడు 89, సుబ్లేడు 84, కాకరవాయి 92, జల్లెపల్లి 53, మేడిదపల్లి 30, జూపెడ 13, పాతర్లపాడు 19, తెట్టేలాపాడు 21, ఎదుళ్లచేరువు 26, జల్లెపల్లి మహిళా సొసైటీ 40 మొత్తం 558గా ఇచ్చారు. జిల్లా అధికారులు 702 సభ్యులు ఉన్నట్లు వివరాలు ఇవ్వటంతో గందరగోళంగా ఉంది.
సభ్యత్వ నిబంధన అమలు చేయని అధికారులు
కాలువల ద్వారా చెరువులోకి నీళ్లు పుష్కలంగా వచ్చే అవకాశం ఉన్నా చెరువుకి ఒక ఎకరానికి ఒకరు చొప్పున సభ్యత్వం ఇవ్వవచ్చు. ఆ లెక్కన జూపెడ చెరువు నీటి విస్తీర్ణం 22 హెక్టార్లు ఈ లెక్కన 55 ఎకరాలు. ఈ చెరువు పరిధిలో 55 మందికి సభ్యత్వం ఇవ్వవచ్చు కానీ, 13 మందికి మాత్రమే సభ్యత్వం ఉంది. చేపలు పట్టడం వచ్చి సభ్యత్వం లేకపోవడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే పథకాలు అందటం లేదని ఆవేదన చెందుతున్నారు. ఇలా అనేక చెరువులలో సభ్యత్వ పరిస్థితి ఇలానే ఉంది. చెరువులో చేపలు చనిపోతున్నాయి
పెద్ద సైజు చేపలు చనిపోవటంతో నష్టం వాటిల్లుతుందని మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారు. చేపలు చావటానికి కారణాలు ఏమిటి అనేది మత్స్యకారులకు సలహాలు, సూచనలు ఇచ్చి అవగాహన కల్పించాల్చిన వారు ఎవరు లేకపోవటంతో ఏమిచెయ్యలేని స్థితిలో మత్స్యకారులు ఉన్నారు.
గ్రామ పంచాయతీ పరిధిలోని చెరువులలో పోసిన చేపలు ఏమౌతున్నాయి?
మండలంలో 40 గ్రామపంచాయతీలున్నాయి. 11గ్రామాల్లో మాత్రమే మత్స్య సహకార సొసైటీలు ఉన్నాయి. మిగిలిన గ్రామాల్లోని చెరువులలో ప్రతి ఏటా మత్స్యశాఖ చేపలు పోసినట్లు లెక్కలు చూపిస్తున్నారు. మరి ఈ చేపల చెరువులను గ్రామాల్లో టామకా వేసి వేలంపాట పెట్టాలి. పాట ద్వారా వచ్చిన డబ్బులు గ్రామ అభివృద్ధికి ఉపయోగించే పద్ద్ధతి జరగాలి.
యూనిట్ల వివరాలు అడిగితే దాటవేత
మండలంలో టీవీఎస్ వాహనాలు 79, వలలు 19 యూనిట్లు సంచార చేపల విక్రయం వాహనాలు 2, షిఫ్ పుడ్ కీయాష్కీ 1 యూనిట్ ఇచ్చారు. ఇవి ఏ సొసైటీ పరిధిలో ఇచ్చారు అనేది లబ్ధిదారుల వివరాలు మత్యశాఖ జిల్లా అధికారులను అడిగితే దాటవేస్తున్నారు. సమాచార హక్కు చట్టం క్రింద దరఖాస్తు పెట్టండి అప్పుడు చూద్దామని అనడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.