Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం రూరల్
జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికయిన మండల పరిధిలోని పెద్దతండాకు చెందిన బోడ దివ్యశ్రీ, హాలవత్ పూజిత, రీతు కుమారిలకు తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు రామసహాయం మాధవిరెడ్డి ఆదివారం రూ 10 వేలు ఆర్థికసాయం అందజేశారు. క్రీడల్లో రాణిస్తున్న విద్యార్థులను అభినందించారు. భవిష్యత్ లో దేశం తరుపున ఆడాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు దాసరి వెంకన్న, బాణోత్ సురేష్ పాల్గొన్నారు.