Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ రేకుల షెడ్డులోనే పోలంపల్లి పాఠశాల
అ తరగతి గదులు లేక విద్యార్థులు అవస్ధ్థలు
అ గదుల నిర్మాణం అధికారులకు పట్టటం లేదు : గ్రామస్తులు
నవతెలంగాణ-కారేపల్లి
ప్రభుత్వ విద్యకు రూ.కోట్లు ఖర్చు చేస్తున్నామని చిలక పలుకులు పలుకుతున్న ప్రభుత్వ పెద్దలారా ఈ పాఠశాల పరిస్ధితిని చూడండి అంటూ కారేపల్లి మండలం పోలంపల్లి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నూరుశాతం గిరిజన విద్యార్ధులు విద్య నభ్యసిస్తున్న పోలంపల్లి ప్రాధమిక పాఠశాల మూడెండ్లుగా రేకుల షెడ్డులోనే నడుస్తుంది. గతంలో శిథిలావస్ధలో ఉన్న భవనాలను కూల్చి వేయటంతో పాఠశాల రికార్డులను పక్కనే ఉన్న అంగన్వాడీ కేంద్రంలో భద్రపర్చి విద్యార్థులకు తరగతులను గ్రామపంచాయతీ కార్యాలయంలో పరిపాలన అవసరాలు పెరగటంతో జీపీ కార్యాలయ భవనం వారికే సరిపోతుంది. ఈ దశలో 2020లో ప్రధానోపాధ్యాయుడు అజ్మీర వీరు నాయక్ స్వంత ఖర్చులతో అంగన్వాడీ భవనంను అనుకోని రేకుల షెడ్డు నిర్మాణం చేసి దానిలోనే విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్నారు. సెప్టెంబర్ 1 నుండి పాఠశాలలు ప్రారంభ కానున్న తరుణంలో విద్యార్థులను రేకుల షెడ్డు క్రింద కూర్చో పెట్టాల్సిన పరిస్ధితి ఉంది. వర్షం వస్తే ఆ రోజు విద్యార్ధులు ఉపాధ్యాయులు అందరు అంగన్వాడీ భవనంల తలదాచుకోవల్సి దుస్థితి ఉందని గ్రామస్తులు పేర్కొన్నారు. పాఠశాలలో తరగతి గదులు నిర్మాణ చేయాలని మొరపెట్టుకున్న అధికారులకు పట్టం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు పోలంపల్లి ప్రాధమిక పాఠశాలకు భవన నిర్మాణం చేయాలని కోరుతున్నారు.