Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు వాసురెడ్డి
అ 16 కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేత
నవతెలంగాణ- సత్తుపల్లి : గత రెండేండ్లుగా కరోనా బాధితులు, దివ్యాంగులు, వృద్దులు, వితంతువులు, పేదలకు నవచైతన్య సేవా సంస్థ అందిస్తున్న సేవలు నిత్య నూతనంగా ఉన్నాయంటూ మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు మందపాటి శ్రీనివాసరెడ్డి (వాసురెడ్డి) అన్నారు. మంగళవారం మండలంలోని గంగారంలో 2 కుటుంబాలు, సత్తుపల్లి, రామానగరం, చెరుకుపల్లి ప్రాంతాల్లో 14 కుటుంబాలకు నవ చైతన్య నిత్యావసర సరుకులు అందించింది. నవచైతన్య అధ్యక్ష, కార్యదర్శులు గాదె నరసింహారెడ్డి, తోట కిరణ్ మాట్లాడుతూ తాము అందిస్తున్న సేవలను ప్రభుత్వం గుర్తించి అవార్డును అందించడం జరిగిందన్నారు.
సేవా భావం ఉండి ప్రత్యక్ష సేవా కార్యక్రమాల్లో పాల్గొనని దాతలు తమ సంస్థ ద్వారా సహాయ అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు పుల్లారావు, జగదీశ్, శ్రీనివాసరెడ్డి, సుధీర్, శ్రీను, యేసయ్య, ముస్తఫా, మారయ్య, కార్తీక్, సునీల్, శినాగరాజు పాల్గొన్నారు.