Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముదిగొండ
సిఎల్పీ నేత మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క మంగళవారం ముదిగొండ మండలంలో సుడిగాలి పర్యటన చేశారు ఈసందర్భంగా న్యూలక్ష్మీపురం, మల్లన్న పాలెం,పమ్మి,కమలాపురం, చిరుమర్రి, గంధసిరి, తదితర గ్రామాలలో ఆయన పర్యటించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకులను పలువురిని పరామర్శించారు. న్యూలక్ష్మీపురం గ్రామసర్పంచ్ వాకదాని కన్నయ్య మల్లన్నపాలెం మాజీ సర్పంచ్ కోలేటి నాగేశ్వరరావులు అనారోగ్యంతో ఉన్న వారిని పరామర్శించారు చిరుమర్రిలో ఓపెళ్లిలో పాల్గొని భట్టి యువజంటను ఆశీర్వదించారు పమ్మిలో ముస్లింల మసీదు ప్రారంభం సందర్భంగా పాల్గొనే ముస్లింలకు ఆయన అభినందనలు తెలిపారు. అనంతరం ఆశ వర్కర్లు వారి సమస్యలపై మల్లు భట్టి విక్రమార్కకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొమ్మినేని రమేష్ బాబు, ఉపాధ్యక్షుడు తాటికొండ రమేష్, ప్రధాన కార్యదర్శి పందిరి అంజయ్య, యువజన కాంగ్రెస్ నాయకులు మల్లెల అజరు కుమార్, పల్లపాటి కృష్ణ, మల్లన్నపాలెం గ్రామసర్పంచ్ చిలకల విజేత రామకృష్ణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు మహమ్మద్ అజ్గర్, బిచ్చాల బిక్షం, మధిర నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బిచ్చాల అన్వేష్ తదితరులు పాల్గొన్నారు.