Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ హైకోర్టు తీర్పుతో సందిగ్ధంలో
పాఠశాల యాజమాన్యాలు
అ ఒక వైపు కరోనా-మరోవైపు ప్రైవేటు
ఉపాధ్యాయుల ఆకలి కేకలు
అ ముందు నుయ్యి వెనక గొయ్యిలా మారిన
విద్యార్థుల, ఉపాధ్యాయుల భవితవ్యం
నవతెలంగాణ-పినపాక
సెప్టెంబర్ ఒకటవ తేదీ నుండి పాఠశాలలు ప్రారంభం అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం తెలియజే యడంతో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, ప్రైవేట్ ఉపాధ్యాయులు ఒకింత ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఆనందం ఇలా ఉండగానే హైకోర్టు తీర్పుతో వారి ఆశలపై నీళ్లు చల్లినట్లు అయ్యింది. చదువులమ్మకు సైతం కరోనా కష్టాలు తీరడం లేదు. ఒక వైపు చదువుల తల్లి సరస్వతి తల్లి కూడా ఆన్లైన్లో ద్వారా విద్యార్థుల దగ్గరకు వెళ్లాలా, ప్రత్యక్షంగా విద్యార్థులు దగ్గరకు వెళ్లాలా తెలియని డైలమాలో పద్మవ్యూహంలో చిక్కుకుంది. పాఠశాల తెరిస్తే తమ పిల్లలు కరోనా బారిన పడతారని చదువులమ్మ భయం ఉన్నా, తన భవితవ్యం ఏమవుతుందని ఒకింత చింత చదువుల తల్లికి పట్టుకుంది. ఒకవైపు పాఠశాలలు తెరవాలా వద్దా అనే సందిగ్ధం పాఠశాల యాజమాన్యాలలో సైతం వ్యక్తమౌతుంది. ఇదిలా ఉంటే ప్రైవేట్ యాజమాన్యాలు పాఠశాల దొరికితే కొంతైనా తమ ఆకలి తీరుతుందని ఆశతో ఉన్న ప్రైవేట్ ఉపాధ్యాయుల ఆశలు ఆవిరయ్యాయి. ఏడాదికిపైగా పాఠశాలలు మూతపడడం చిన్నారుల శ్రేయస్సుపై ముఖ్యంగా వారి మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించింది. పాఠశాలలు తిరిగి ప్రారంభించకపోవడం వల్ల స్కూళ్లకు దూరంగా ఉంటూ పిల్లలు నాలుగు గోడలకే పరిమితం కావడం తల్లిదండ్రుల, చిన్నారుల మధ్య సంబంధం పైనా ప్రతికూల ప్రభావం చూపెడుతుంది. వీటిని దృష్టిలో ఉంచుకొని పాఠశాలలను తిరిగి తెరవడం అత్యంత అవసరమని పలువురు సూచిస్తున్నారు.
ప్రైవేట్ పాఠశాలపై మరింత భారం
రాధిక హై స్కూల్ కరస్పాండెంట్ మధుసూదన్ రెడ్డి
సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలను ప్రారంభిం చేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశాం. కరోనా నియమాలను పాటిస్తూ నడపాలని నిర్ణయించు కున్నాము. పాఠశాల నడిస్తే కొంతైనా నష్టాన్ని తగ్గించుకోవచ్చని భావించాము. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం పాఠశాల నడపడానికి సిద్ధంగా ఉన్నాం.
అధికారుల ఆదేశాల ప్రకారం నడుచుకుంటాం...
ఎక్స్లెంట్ హై స్కూల్ కరస్పాండెంట్ నరేందర్
కరోనావల్ల తీవ్రంగా నష్టపోయాము. అయినా ఉపాధ్యాయులకు ఎంతోకొంత జీతాన్ని అందిస్తూనే ఉన్నాం. విద్యార్థులను పాఠశాలకు పంపమని బలవంతం చేసే ప్రసక్తి ఉండదు. ప్రత్యక్ష విద్యాబోధన వల్ల విద్యార్థులకు లాభం చేకూరుతుంది. ప్రభుత్వ నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తాం.