Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ మా అంగన్వాడీ కేంద్రాలకు రండీి...!!
అ అంగన్వాడీ కేంద్రంలో చేరాలని డప్పు ప్రచారం
చేసిన కౌన్సిలర్ శ్రీనివాస్
నవతలంగాణ-కొత్తగూడెం
రండి బాబూ... రండి...! మా అంగన్వాడీ కేంద్రాలకు రండీి...!! అంగన్వాడీ కేంద్రంలో చేరాలని డప్పు ప్రచారంతో వినూత్నంగా ప్రచారం చేసి ప్రజల్లో చైతన్యం కలిగించారు. మున్సిపల్ వార్డుకౌన్సిలర్ భూక్యా శ్రీనివాస్ కొత్తగూడెం మున్సిపల్ 11 వార్డ్‌లో ప్రభుత్వం ఉతర్వులు మేరకు సెప్టెంబర్ 1 నుండి అంగన్వాడీ, కేజీ టూ పీజీ వరకు తరగతులు ప్రారంభించాలని సూచించిన నేపద్యంలో వార్డు కౌన్సిలర్ వినూత్నంగా డప్పు కొట్టుకుంటూ ఇంటింటికీ తిరిగిన ప్రచారం చేశారు. ఆహ్వానం కరపత్రాలు పంచారు. అంగన్వాడీ సెంటర్స్ చిట్టి రామవరం 1, 2 సెంటర్స్, టీచర్స్ శ్రీదేవి, తులసి బారు , ఆయా మీన, మున్సిపల్ కార్మికులు ఓదెలు, పద్మ పాల్గొన్నారు