Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చింతకాని
ఈనెలలో ప్రజాసమస్యలపై పోరాటాలు ఉధృతంగా నిర్వహించనున్నట్లు సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు అయినా ఇంకా అనేక ప్రధాన హామీలు నెరవేర్చలేదన్నారు. పార్టీ మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రుణమాఫీ చేయకపోవడంతో రైతులు వడ్డీకి వడ్డీలు చెల్లించాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఈ నెల 4న ప్రజా సమస్యలపై అన్ని గ్రామాల్లో ప్రదర్శన నిర్వహించనున్నట్లు అలాగే 6న మండల కేంద్రంలో ధర్నా నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. సమావేశంలో మధిర నియోజకవర్గ కన్వీనర్ చింతలచెరువు కోటేశ్వరరావు, మండల కార్యదర్శి మడిపల్లి గోపాల్ రావు, మండల కమిటీ సభ్యులు వత్సవాయి జానకి రాములు, తోటకూర వెంకట నరసయ్య, నన్నక కృష్ణమూర్తి, బల్లి వీరయ్య, పులి యజ్ఞ నారాయణ, రాచబంటి రాము, గడ్డం రమణ, మద్దిని బసవయ్య, కాటబత్తిన వీరబాబు తదితరులు పాల్గొన్నారు.
బోనకల్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై, ప్రజా సమస్యలపై సెప్టెంబర్ నెలలో పోరాటాలు, ఆందోళనలు నిర్వహించనున్నట్లు సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు తెలిపారు. వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల భవనంలో సిపిఎం మండల స్థాయి విస్తత సమావేశం మాజీ ఎంపీపీ తుళ్లూరు రమేష్ అధ్యక్షతన మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 17వ తేదీన జిల్లా కేంద్రంలో తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిం చనున్నట్లు ఆయన తెలిపారు. కెసిఆర్ ప్రభుత్వ భూములను అమ్ముతుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతున్నారని విమర్శించారు. ప్రజా సంపదను పెట్టుబడిదారులకు కట్ట పెడుతున్న ఈ పాలకులు ప్రజల అభివృద్ధి కోసం ఏమి చేస్తారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలు రాజకీయాలకు అతీతంగా పోరాటం లోకి రావాలని ఆయన కోరారు. సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చింతలచెరువు కోటేశ్వరరావు మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వర రావు, ఐద్వా మండల కార్యదర్శి జొన్నలగడ్డ సునీత, సిపిఎం నాయకులు ఏడు నూతల లక్షణ రావు, ఉమ్మనేని రవి, మాధినేని వీరభద్ర రావు, కిలారు సురేష్, గుడిపూడి వెంకటేశ్వర్లు, కొమ్మినేని నాగేశ్వరరావు, బంధం శ్రీనివాస రావు, కొంగర గోపీ, పిల్లల మర్రి వెంకట అప్పారావు, ముక్కపాటి అప్పారావు,షేక్ నజీర్, మందా వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.