Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సత్తుపల్లి రూరల్
ఆసరా పింఛన్ దరఖాస్తు దారుల తీరు చూస్తావుంటే ఆసరా పింఛన్‌కు ముందే మహమ్మారి కరోనా వచ్చేలా ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం 57 సంవత్సరాలు పైబడిన అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆసరా పింఛన్ పథకం ప్రకటించారు. మీసేవా కేంద్రాల వద్ద పింఛన్ దారులు పోటీ పడి మరీ దరఖాస్తులు ఇస్తున్నారు. అంటే ఆసరా పింఛన్ అవసరం అటువంటిది అనడంలో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే.. ఒకప్రక్క మహమ్మారి కరోనా మూడవ దశ తరుము కోస్తా వుందని మేధావీ వర్గం హెచ్చరిస్తున్నారు. మరో పక్కన కరోనా కట్టడిలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సైతం నిబంధనల పట్ల అలసత్వం వహించడంతో గత రెండు సంవత్సరాలుగా.. ఏ మాత్రం కనిపించని సీజనల్ వ్యాధులైన డెంగ్యూ, మలేరియా, టైపాయిడ్ తదితర ప్రాణాంతకమైన వ్యాధులు పోటాపోటీగా మూకుమ్మడిగా ప్రజలపై పడుతుంటే.. ప్రజలు తమ ప్రాణాలు అరచేతుల్లో పట్టుకోని ప్రయివేట్ ఆసుపత్రుల వైపు పరుగులు తీస్తావుంటే..! ఇదే అదునుగా భావించిన కొంతమంది డాక్టర్లు తమ విలువులు మరసి, ధనమే ధ్యేయంగా దోసుకు తినే పనిలో పడ్డారు. ఇటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ ప్రభుత్వం ఆసరా పింఛన్ పధకాన్ని ప్రవేశ పెట్టడం దరఖాస్తు దారులకు ఒక విధంగా ఉపయోగమే అయినా..!
కానీ ఆసరా పింఛన్ కొరకు దరఖాస్తులు చేసుకోవడానికి ఒక డెడ్ లైన్ పెట్టడం, వాటి కోసం దరఖాస్తుదారులను, మీసేవా, ఈ సేవా తదితర కార్యాలయాల చుట్టూ తిప్పించడం ఏమాత్రం సబము కాదు. ఇది పింఛన్ దారులను ఆసరా పింఛన్‌కు దగ్గర చేసేలా లేదు. సీజనల్, మహమ్మారి కరోనా లాంటి వ్యాధులకు దగ్గర చేసేలా ఉంది.
ఇప్పటికైనా కేసీఆర్ ప్రభుత్వం, ప్రజల ఆరోగ్యం పట్ల సరైన ఆలోచన చేసి ఆసరా పింఛన్ దరఖాస్తు దారులను మీసేవా, ఈ సేవా కార్యాలయాల వద్దకు ఉరుకులు, పరుగులు పెట్టించి ఒకే చోటకు గుంపులు గుంపులుగా చేర్చే కార్యక్రమం మానుకోని ప్రతి గ్రామ పంచాయతీ, ఎంపీడీవో తదితర ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఆసరా దరఖాస్తులు తీసుకొనేలా తగిన చర్యలు తీసుకోవాలి. లేదంటే సీజనల్ వ్యాధులుకే కాదు, మాయదారి కరోనా మూడవదశకు కూడా ఈ విధంగా తలుపులు బార్లా తెరసిన, పాపం, ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుంది. అంటూ ప్రజలతోపాటు పింఛన్ దారులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.