Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
కొత్తగూడెం రుద్రంపూర్ ఏరియా 2021-22 ఆర్థిక సంవత్సరం ఆగస్టు నెలకు కొత్తగూడెం ఏరియాకు నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమించి 117 శాతం నమోదు చేసిందని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ సిహెచ్.నరసింహా రావు తెలిపారు. ఆగస్టు నెలకు ఇచ్చిన లక్ష్యం 7.88 లక్షల టన్నుల ఉత్పత్తికి గాను 9.25 లక్షల టన్నులు ఉత్పత్తి చేసి 117 శాతం సాధించడం జరిగిందని తెలిపారు. 2021-22 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు 46.01 లక్షల టన్నులకు గాను 47.41లక్షల టన్నులు ఉత్పత్తి చేసి 103 శాతం ఉత్పత్తి లక్ష్యం సాదించినట్టు తెలిపారు. ఆగస్టు నెలలో రోడ్డు, రైల్ ద్వారా 9.52 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేసినట్లు తెలిపారు. 2021-22 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు రోడ్డు, రైల్ మార్గం ద్వారా 49.88 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేసినట్లు తెలిపారు. కొత్తగూడెం ఏరియా ఇప్పటి వరకు 318 వారసులకు కారుణ్య నియామకాల క్రింద ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు తెలిపారు.36 మంధికి ఉద్యోగం బదులు ఏక మొత్తం చెల్లించామన్నారు. ఒకరికి నెలవారి బృతి మంజూరు చేయటం జరిగిందన్నారు. కార్మికుల సంక్షేమంలో భాగంగా ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లిలో నిర్మించిన 352 క్వార్టర్లను ఆగస్టు 29న సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య చేతులమీదుగా ప్రారంభించామని తెలిపారు.