Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ క్రీడా సేవా రత్న పురస్కారం
అ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్
ఆధ్వర్యం జాతీయస్థాయి అవార్డు ప్రధానం
నవతెలంగాణ-కొత్తగూడెం
జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాదులో జరిగిన గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ స్థాయి క్రీడా పురస్కారాలను మంగళవారం సాయంత్రం హైదరాబాదులో అందజేశారు. నిరంతరంగా గత రెండు దశాబ్దాలుగా అనేక క్రీడాంశాలలో ఎంతో మంది చిన్నారులను మెరుగైన క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెంకు చెందిన ఇమామ్‌ను వరించింది.
ఓ సామాన్య శిక్షకుడు ఇమామ్‌ను క్రీడా సేవ రత్న అవార్డుతో సత్కరించారు. ఇమామ్ కొత్తగూడెం చిన్న బజార్లో ఓ చిరు వ్యాపారం నిర్వహించుకుంటున్నాడు. ఎంతో మంది క్రీడాకారులను హాకీ క్రీడాకారులుగా తీర్చిదిద్దాడు. స్వతహాగా ఫుట్ బాల్, కరాటే శిక్షణలో పలు అవార్డులు అందుకున్న ఇమామ్ దశాబ్దకాలంగా పూర్తిస్థాయి హాకీ క్రీడలను ప్రోత్సహిస్తూ వందలాది మంది హాకీ క్రీడాకారులను తయారు చేశాడు. జిల్లాలో దాదాపు 10 క్లబ్‌లను స్థాపించి 300 మందికి పైగా హాకీ క్రీడాకారులను తయారు చేశాడు. అంతర్జాతీయ కళాకారులు ట్రిపుల్ ఒలంపియన్ అర్జున అవార్డు గ్రహీత ముఖేష్ సైతం హైదరాబాదులో భద్రాద్రి జిల్లా హాకీ టీం అంటే స్థానం కల్పించేలా మెరుగైన క్రీడాకారులను ఎంతోమందిని తయారు చేశాడు. ఈ సందర్భంలో భద్రాద్రి హాకీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పల్లపోతు వాసు, ఉపాధ్యక్షురాలు కృష్ణవేణి, ఉమ్మడి ఖమ్మం జిల్లా హాకీ సెక్రెటరీ బట్టు ప్రేమ్ కుమార్, కొత్తగూడెం హాకీ క్లబ్ అధ్యక్షుడు ఇమంది ఉదరు కుమార్, సీనియర్ కోచ్ సలీం, సీనియర్ క్రీడాకారులు ఇమామ్‌కు అభినందనలు తెలిపారు.