Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
రేపు ఢిల్లీలో జాతీయ పార్టీ భవన నిర్మాణ శంకుస్థాపనకు పినపాక నియోజకవర్గంలోని అన్నీ గ్రామాల్లో జాతీయ పండుగ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసన సభ్యులు రేగా కాంతారావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... రేపటి నుండి 12వ తేదీ వరకు గ్రామ, వార్డు కమటీలను పూర్తి చేయాలన్నారు. గ్రామాలలో పాత అధ్యక్షులను తొలగించి కొత్తవారిని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. అదే సమయంలో కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకోవాలన్నారు. నియోజవర్గ స్థాయి నాయకులు అన్నీ కమిటీలు సవ్యేంగా పూర్తి చేసే విధంగా చూడాలన్నారు. నియోజకవర్గ ఇన్చార్జ్లు తుళ్లూరి బ్రహ్మయ్య, పటేల్ భద్రయ్య, పోశం నర్సింహారావు, కంది సుబ్బారెడ్డి, బొలిశెట్టి నర్సింహారావు, ప్రభుదాస్ తదితరులు నియమించారు. ఈ కమిటీలు 2023 ఎన్నికల కమిటీలో వుంటారని ఆయన తెలియజేశారు.
పినపాక టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, సీఎం కే.చంద్రశేఖర్ రావు, ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు వచ్చే నెల 02న గ్రామ, గ్రామన టీఆర్ఎస్ పార్టీ జెండా పండుగను ఘనంగా నిర్వహించాలని మండల పార్టీ అధ్యక్షులు సతీష్ రెడ్డి తెలిపారు. మండల టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. సెప్టెంబర్ 2వ తేదీ నుండి 12వ తేదీ వరకు గ్రామ, బ్లాక్ కమిటీలు పూర్తి చేయాలని సర్పంచులకు, ప్రజాప్రతినిధులకు తెలిపారు. 12వ తేదీ తరువాత మండల, పట్టణ అధ్యక్షుల ఎంపిక, అనుబంధ సంఘాల ఎంపిక చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుమ్మడి గాంధీ, జెడ్పీటీసీ సుభద్రాదేవి వాసు బాబు, సహకార సంఘం చైర్మన్ రవి శేఖర్ వర్మ, ఆత్మ కమిటీ చైర్మన్ భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
కరకగూడెం ప్రతి గ్రామంలో పార్టీ టీఆర్ఎస్ పార్టీ జండా ఎగరాలని ఆ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య అన్నారు. మండల కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం మండల అధ్యక్షుడు రావుల సోమయ్య అధ్వర్యంలో పార్టీ ముఖ్య కార్యకర్తలు, సర్పంచులు, ఉప సర్పంచుల సమావేశం ఏర్నాటు చేసి, మాట్లాడారు. ఈ సమావేశంలో ఎంపీపీ రేగా కాళికా, జడ్పీటీసీ కాంతారావు, రాంబాబు, సీనియర్ నాయకులు రాము, చిట్టి సతీష్, పెద్ద రామలింగం, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దమ్మపేట టీఆర్యస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షలు కేసీఆర్ ఆదేశానుసారం, వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి మేరకు సెప్టెంబర్ 2న అశ్వారావుపేట నియోజకవర్గంలోని అన్నిమండలాలోని పంచాయతీలలో టీఆర్యస్ పార్టీ జెండా పండుగను ఘనంగా నిర్వహించాలని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేశారు.