Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ అఖిలపక్ష సమావేశంలో ఆర్టీసీ డీఎం వెల్లడి
నవతెలంగాణ-చర్ల
గతంలో నడిపిన సర్వీసులైన హైదరాబాద్, వరంగల్, గుంటూరు బస్సుల పునరుద్ధరించి చర్ల బస్టాండ్ అభివృద్ధికి కృషి చేస్తానని భద్రాచలం ఆర్టీసీ డిపో మేనేజర్ వి.రామారావు అన్నారు. మంగళ వారం ఉదయం 11 గంటలకు చర్ల పంచాయతీ కార్యాలయ ఆవరణలో సర్పంచ్ కాపుల కృష్ణార్జునరావు అధ్యక్షతన నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో చర్ల బస్టాండ్ పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానికులు ప్రజా రవాణా వ్యవస్థ తెలిపిన సమస్యలు, సలహాలను స్వీకరించిన డీఎం తన పరిధి వరకు ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గతంలో నడిపిన సర్వీసులైన హైదరాబాద్, వరంగల్, గుంటూరు బస్సుల పునరుద్ధరణ, కాంపౌండ్ వాల్ నిర్మాణం, క్యాంటీన్ తదితర షాపు అద్దెల తగ్గింపు, షాపింగ్ కాంప్లెక్స్‌ను నిర్మించి, ఇప్పుడున్న వారికె కాకుండా కొంత మంది కొత్తవార్కి షాపులు కేటాయింపు, ఫంక్షన్ హాల్, పెట్రోల్ బంకు నిర్మాణం తదితరాలు చేయడం జరుగుతుందని వివరించారు. అనంతరం బస్టాండ్ పరిరక్షణ కమిటీ ఎన్నుకున్నారు.
బస్టాండ్ పరిరక్షణ కమిటీ ఎన్నిక అధ్యక్ష, కార్యదర్శులుగా ప్రకాష్, అజీజ్
నానాటికీ శిథిలమవుతున్న చర్ల బస్టాండ్ పరిరక్షించుకోవడానికి అఖిలపక్ష కమిటీని ఏర్పరచుకొని, ప్రతీ విషయాన్నీ కూలంకషంగా చర్చించుకొని, సమిష్టి నిర్ణయాలతో మందుకు వెళ్లాలని అఖిలపక్షం తీర్మానించారు. కమిటీని ఈ కింది సభ్యులతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్ష కార్యదర్శులుగా నీలి ప్రకాశ్, ఎస్డీ అజీజ్, గౌరవ అధ్యక్షులుగా ఎంపీపీ గీద కోదండ రామయ్య, జెడ్పీటీ ఇర్ఫా శాంత, మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ కాపుల కృష్ణార్జున రావు, ఉపాధ్యక్షులుగా సిహెచ్ మురళి క్రిష్ణ, పాయం సత్యనారాయణ, అడ్డ గర్ల తాతాజీ, బిట్రగుంట క్రాంతి సహా కార్యదర్శులుగా దొడ్డి హరి నాగ వర్మ, లంకా వెంకట్, ఎడారి సత్యనారాయణ, పటేల్ వెంకటేశ్వర్లు కోశాధికారిగా దొడ్డి తాతారావు కార్యవర్గ సభ్యులుగా సిహెచ్ సాయిచరణ్, తోట మల్ల గోపాలరావు, తోట మల్ల రమణ మూర్తి, కాకి అనిల్, ఎడల గణపతి, తాటి రామకృష్ణ కుంజాశ్రీను, తాటి లక్ష్మణ్, నూపానాగేశ్వరరావు, రుంజా రాజా, కొండా చరణ్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు రమణారావు, విశ్రాంత ఉపాధ్యాయులు బస్టాండ్ పూర్వోపరాలు సవివరంగా వివరించారు.