Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ రక్షించడంలో విఫలమవుతున్న
యాజమాన్యం
అ ఆకతాయిలకు నిలయంగా
తరగతి గదులు
అ అసాంఘీక కార్యకలాపాలకు
అడ్డ ప్రభుత్వ జూనియర్ కాలేజ్
నవతెలంగాణ-కొత్తగూడెం
విద్యాసంస్థలు గత కొంత కాలంగా మూసి వేయడంలో ఆకతాయిలకు అడ్డాగా మారాయి... దొంగలకు వారి చేతి వటం ప్రదర్శించేందుకు అవకాశం దొరికింది. ఇంకే ముందు కళాశాల ప్రాంగణం ఆకతాయిలకు అడ్డాగా మారింది.
కొత్తగూడెలో ఎంతో చరిత్ర కలిగిన కేవైకెఆర్వై అండ్ బిఎన్ గౌడ్స్ ప్రభుత్వ జూనియర్ కళాశాల రోజు రోజుకు శిధిలావ్యవస్థకు చేరుకుంటుంది. పేరుగాంచిన కళాశాలలో ఉన్న సామాగ్రి దొంగల పాలవుతోంది. కోవిడ్-19 కరోనా కారణంగా విద్యా సంస్థలు గత కొన్ని నేలలుగా మూతపడ్డాయి. ఇదే అదునుగా భావించిన దొంగలు కళాశాల ఆవరణలో ఉన్న విలువైన సామాగ్రిని తస్కరిస్తున్నారు. తరగతి గదులు తాళాలు పగలగొట్టి గది లోపల ఉన్న బెంచీలు, బల్లలు, విలువైన సామాగ్రిని, ఫ్యాన్లు మాయం చేస్తున్నారు.
కళాశాల యాజమాన్యం సరైన పర్యవేక్షణ లేకనే దొంగలు వారి పని వారు కానిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కళాశాలలో ఏర్పాటు చేసిన టాయిలెట్ ఇనుప తలుపులను సునాయాసంగా తరలిస్తున్నారు. ఇదంతా గత కొంతకాలంగా జరుగుతున్న నేపథ్యంలో కళాశాల అధ్యాపక బృందం దృష్టిసా రించింది. దొంగలను పట్టుకోవాలని ప్రయత్నం చేసింది. మద్యానికి బానిసైన యువకుడు పట్టపగలే కళాశాలలోకి ప్రవేశించి కిటికీలకు ఉన్న ఇనుప చువ్వలను కాజేస్తున్న క్రమంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. స్థానిక వన్ టౌన్ పోలీసులకు అప్ప గించారు. విచారణంలో తనతో పాటు కొంత మంది ఉన్నారని తేలింది. రాత్రుల్లు పెట్రోలింగ్ నిర్వహిస్తే ఈ ఆగడాలను అడ్డుకునే అవకాశం ఉంటుందని కళాశాల అధ్యాపక బృందం కోరుతున్నారు.