Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ 4, 6వ తేదీలలో గ్రామస్థాయి సమస్యలపై ర్యాలీలు, ధర్నాలు
అ తహసీల్దార్‌కు వినతి పత్రాలు అందజేయాలి
అ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కనకయ్య
నవతెలంగాణ-మణుగూరు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డెంగ్యూ, విషజ్వరాలు విజృంభిస్తున్నాయని, రోజు రోజుకు మరణాలు సంఖ్య పెరుగుతుందని, హెల్త్ ఎమర్జన్సీ ప్రకటించి ప్రజల ప్రాణాలు కాపాడాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య అన్నారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ముఖ్యకార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ... ప్రతి గ్రామంలో స్థానిక సమస్యలపై గ్రామపంచాయతీ కార్యాలయాల ముందు ధర్నాలు, కార్యదర్శలకు వినతి పత్రాలు అందజేయాలన్నారు. 6వ తేదీన మండల కేంద్రాలలో ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు, మండల కార్యాలయాల ముందు ధర్నాలు చేపట్టాలన్నారు. ప్రధానంగా జిల్లాలోని అన్నీ గ్రామాలలో ప్రతి ఇంటిలో జ్వరపిడీతులు వున్నారన్నారు. వారికి వైద్యం అందక మృత్యువాతకు గురవతున్నారన్నారు. గ్రామాలోని ప్రజలందరికీ కోరనా వ్యాక్సినేషన్ ఇవ్వాలని, విషజ్వరాలను అరికట్టాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేటీకరణకు వ్యతిరేఖంగా కార్మిక, రైతు వ్యతిరేఖ చట్టాలను రద్దు చేయాలని, పోడుభూమి సాగుదారులపై దౌర్జన్యాలు ఆపాలని, పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని రాష్ట్ర పిలుపులో భాగంగా 4, 6వ తేదీలలో నిరసన కార్యక్రమాలు తెలియజేయాలని ఆయన తెలిపారు. ప్రధానంగా పినపాక నియోజకవర్గంలో కుమ్మరిగూడెం వద్ద నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్ట్ ద్వారా జిల్లాలలోని అన్నీ మండలాలకు సాగునీరందించాలన్నారు. సీతమ్మ బ్యారేజి భూ నిర్వాసితులకు మార్కెట్ ధరకు అనుగుణంగా చట్టపరమైన ప్యాకేజి అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 25న దేశ వ్యాప్త కార్మిక, రైతు వ్యతిరేఖ చట్టాలపై ప్రజా సంఘాలు నిర్వహిస్తున్న బంద్‌ను జయప్రదం చేయాలన్నారు. ఈనెల 12వ తేదీన రాష్ట్రవ్యాప్త పోడుభూముల సదస్సును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా ఈనెల 30న పోడుభూముల సమస్యలపై అచ్చంపేట వరకు రహదార్లు దిగ్భద్దనం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నెల్లూరి నాగేశ్వరరావు, టివిఎంవి.ప్రసాద్, పిట్టల నాగమణి, నందం ఈశ్వర్రావు, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఉప్పతల నర్సింహారావు, కోడి నర్సింహారావు, పల్లే చంద్రయ్య, శివ తదితరులు పాల్గొన్నారు.