Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోనకల్
టీఆర్ఎస్ పార్టీ జెండా పండగ నిర్వహించాలనే పిలుపులో భాగంగా మండల పరిధిలోని ముష్టి కుంట గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ జెండాను జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, పార్టీ మధిర నియోజకవర్గ మాజీ ఇన్చార్జి బొమ్మెర రామ్మూర్తి పార్టీ జెండాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించడం సంతోషకరమైన విషయమని, ఎన్నో ఉద్యమ త్యాగాలతో సాధించుకున్న రాష్ట్రలో మన రాష్ట్రం మన పాలన లో బాగంగా బంగారు తెలంగాణా సాధన కోసం ఏర్పడ్డ ఉద్యమ రాజకీయ పార్టీ టిఆర్ఎస్ అన్నారు. గులాబీ జెండ గొప్పతనాన్ని అందరు గుర్తించాలని అలాంటి గులాబీ జెండాకి అండగా ఉండాలని కోరారు. బోనకల్ మండలం లోని అన్ని గ్రామాలలో ఆయా గ్రామాల టిఆర్ఎస్ పార్టీ నాయకులు టీఆర్ఎస్ దిమ్మల పై ఆ పార్టీ పతాకాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, ఎంపీటీసీలు, సొసైటీ అధ్యక్షులు, రైతు బంధు సమితి నాయకులు వివిధ హౌదాల్లో ఉన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జెండా పండుగ
నవతెలంగాణ-గాంధీచౌక్
ఖమ్మం నగరంలోని టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయం తెరాస జెండా పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయ ఇంఛార్జి కృష్ణ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తమ ఆత్మగౌరవాన్ని వినువీధుల రెపరెపలాడించిన గులాబీ జెండాకు 60 లక్షలకు పైగా టీఆర్ఎస్ సైన్యం పండుగ చేస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ విజరు కుమార్, ఏఎంసి చైర్మన్ లక్ష్మీ ప్రసన్న, నగర అధ్యక్షుడు కార్పొరేటర్ కామర్తపు మురళి, మహిళ కార్పొరేటర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
సత్తుపల్లి రూరల్ : మండల పరిధిలోని కాకర్లపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద టీఆర్ఎస్ పార్టీ జెండా పండుగ ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా సర్పంచ్ కంచర్ల రమాదేవి, ఉప సర్పంచ్ ఏగోటి పెద్దిరాజుల సమక్షంలో ఆ గ్రామంలోని ఆ పార్టీ దళిత నాయకులు హెచ్చు వెంకటేశ్వరావు ఆ పార్టీ జెండా విష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో ఆయా గ్రామ పంచాయతీ సర్పంచ్ లు, ఎంపిటిసిలు, ప్రజాప్రతినిధులు, పాల్గొన్నారు.