Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అశ్వారావుపేట
ఆగిఉన్న ట్రాక్టర్ ట్రక్ తగలడంతో ఆటోలో ప్రయాణిస్తున్న మహిళ మృతి చెందిన సంఘటన గురువారం వెలుగుచూచింది. మృతురాలు దారా స్వరాజ్యం (53) భర్త క్రిష్ణా రావు ఫిర్యాదు మేరకు పోలీసులు తెలిపిన కథనం ప్రకారం మండల పరిధిలోని వేదాంతపురానికి చెందిన దారా క్రిష్ణారావు భార్య స్వరాజ్యం(53) బుధవారం వేదాంతపురం నుండి తన స్వంత ఆటోలో పశ్చిమ గోదావరి జిల్లా, చింతలపుడి బందువులు ఇంట శుభకార్యానికి హాజరు అయ్యారు. తిరుగు ప్రయాణంలో ఆశ్వారావుపేట మండలం స్థానిక కొబ్బరి విత్తనోత్పత్తి కేంద్రం సమీపంలోకి రాగానే ఎదరుగు వస్తున్న వాహనాన్ని తెప్పించే క్రమంలో అప్పటికే పామ్ ఆయిల్ గెలలు లోడుతో రాత్రి 7.30 గంటల సమయంలో నిలిపి ఉంచిన ట్రాక్టర్ ట్రక్ వెనుక భాగాన్ని ఆటో ఢ కొట్టింది. ఈ క్రమంలో ఆటోలో ఉన్న స్వరాజ్యంకు తీవ్రగాయాలు అయ్యాయి. ఆమెను స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందింది. హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.