Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ వెయ్యి కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్
నవతెలంగాణ-నేలకొండపల్లి
మున్నూరు కాపులకు వెయ్యి కోట్లతో కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మున్నూరు కాపు పాలేరు నియోజకవర్గం కోఆర్డినేటర్ మారిశెట్టి వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మున్నూరుకాపులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక పొట్టి శ్రీరాములు సెంటర్ లో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. అనంతరం అక్కడి నుండి భారీ ప్రదర్శన బయలుదేరి నినాదాలు చేసుకుంటూ తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం నాయకులు తోట శ్రీను, రేపాల రాములు, కందికొండ సత్యనారాయణ, కందికొండ శ్రీను, బాజా నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
మున్నూరు కాపు సంఘం వినతి
వైరా : తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వైరా మండల మున్నూరు కాపు సంఘం విజ్ఞప్తి చేసింది. గురువారం మండల కాపు సంఘం ఆధ్వర్యంలో వైరా తహసీల్దార్ హళావత్ రంగాకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన నాయకులు ముదిగొండ మహేష్, గుత్తా నాగరాజు, ఆది శ్రీకాంత్, దేవిసెట్టి సందీప్ గుత్తా నాగేంద్రబాబు, అమరం సుబ్బారావు, రేచర్ల నాగేశ్వర రావు, పుల్లయ్య, కంభంపాటి సత్యనారాయణ, సీతారాములు, సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.