Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తిరుమలాయపాలెం
మండలంలోని పాపాయి గూడెం గ్రామంలో జాల వెంకటేశ్వర్లు కుమారుడు జాల మహేష్ సాప్ట్ వేర్ ఇంజనీర్ ఐదు రోజుల కిందట గుండెపోటుతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గురువారం పాపాయి గూడెంలో మహేష్ ఇంటికీ వెళ్లి వారి తల్లిదండ్రులను పరామర్శించారు. మహేష్ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్, మండల కార్యదర్శి అంగిరేకుల నర్సయ్య, కేవీపీఎస్ రాష్ట్ర నాయకులు కొమ్ము శ్రీను, శాఖ కార్యదర్శి తొంటి వెంకటేశ్వర్లు, రేపాకుల వెంకన్న, వీరభద్రం, వంశీ, నవీన్, జాల ఉమేష్, పాల్గొన్నారు. జాల మహేష్ కుటుంబాన్ని పీసీసీ ఉపాధ్యక్షులు మాజీ మంత్రి సాంబాని చంద్రశేఖర్, మండల జడ్పిటిసి బెల్లం శ్రీనివాస్ పరామర్శించారు.