Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం లీగల్
సెప్టెంబర్ 11 నిర్వహించబోయే జాతీయ లోక్ అదాలత్లో రాజీపడ దగిన క్రిమినల్ కేసులను అధికసంఖ్యలో పరిష్కరించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ పాష పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన బుధవారం జూనియర్ సివిల్ జడ్జిలు, కోర్టు కానిస్టేబుల్ లతో సమావేశం నిర్వహించారు. కేసులను రాజీ మార్గంలో పరిష్కరించకుంటే ఒనగూరే ప్రయోజనాలను కక్షిదారులకు వివరించడం ద్వారా వారిని ప్రోత్సహించాలని న్యాయమూర్తి సూచించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు అనితారెడ్డి, ఉషశ్రీ, రూబీనా ఫాతిమా, శాంతి సోని, మౌనిక, పూజిత పాల్గొన్నారు.