Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం లీగల్
కొత్తగూడెం అదనపు అసిస్టెంట్ జడ్జి కోర్టుకు నూతనంగా అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియమింపబడ్డారు. గురువారం బాధ్యతలు స్వీకరించారు. డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ హైదరాబాదు ఉత్తర్వుల మేరకు పివి డి.లక్ష్మిని నియమించారు. ఆమె మహబూబాబాద్ జిల్లా డోర్నకల్‌లో జన్మించారు. 2008లో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా అపాయింట్ అయ్యారు. ఖమ్మం, ఇల్లందు, వరంగల్, ఖమ్మం కోర్టుల్లో పని చేస్తూ ప్రమోషన్ పై కొత్తగూడెం బదిలీ అయ్యారు. కొత్తగూడెం కోర్టులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియమింప పడటం పట్ల కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, కార్యవర్గం, న్యాయవాదులు, మానిటరింగ్ కమిటీ సభ్యుడు మెండు రాజమల్లు లు హర్షం వ్యక్తం చేశారు.
గులాబీ జెండాకు అవమానం.. సిద్ధిక్ నగర్ లో ఎగరని టీఆర్ఎస్ జెండా
కొణిజర్ల : టీఆర్ఎస్ సంస్థగత ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పైగా టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర మంత్రి కేటీఆర్ తెలంగాణ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో పార్టీ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చినా మండలంలోని సిద్దిక్ నగర్ గ్రామంలో పార్టీ జెండాను ఎగరవేయకపోవడంతో గ్రామంలోని పార్టీ శ్రేణుల్లో, అభిమానుల్లో నిరుత్సాహం ఏర్పడింది. గత పంచాయతీ, ఎంపిటిసి ఎన్నికల్లో స్వల్పతేడాతో టీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోయారు. గ్రామంలో బలమైన పార్టీగా ఉన్నప్పటికి జెండా ఎగరవేయకపోవడం విశేషం.