Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ మృతురాలి కుటుంబానికి శాపం
నవతెలంగాణ-బోనకల్
ఓ మహిళ మృతి చెందిన సంఘటనలో ఆశా కార్యకర్త తప్పుడు నివేదిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇవ్వటంతో ఆ కుటుంబానికి శాపంగా మారింది. ఇందుకు సంబంధించి బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం... మండల పరిధిలోని సీతానగరం గ్రామానికి చెందిన గడ్డం అన్నపూర్ణమ్మ ఆమె కూతురు గడ్డం వెంకాయమ్మ కలిసి నివాసం ఉంటున్నారు. వెంకాయమ్మ కు జూన్ మాసంలో కరోనా వ్యాధి రావడంతో కొన్ని రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొంది, అనంతరం సీతానగరం తల్లి తీసుకు వచ్చింది. కొన్ని రోజుల తర్వాత వెంకాయమ్మ మృతి చెందింది.
అయితే ఇటీవల అన్నపూర్ణమ్మ తన కూతురి మరణ ధ్రువీకరణ పత్రం కోసం గ్రామ పంచాయతీ కార్యాలయంకు వెళ్ళింది. విచారణ చేసి ఇస్తామని పంచాయతీ కార్యదర్శి చావా తులసి ఆమెకు తెలిపింది. కొద్దిరోజుల తర్వాత కార్యాలయానికి వెళ్ళింది. అయితే ఆ సమయంలో పంచాయతీ కార్యదర్శి వెంకాయమ్మ సీతానగరంలో మృతి చెంద లేదని ఆశ కార్యకర్త నివేదిక ఇచ్చిందని అన్నపూర్ణ అమ్మకు స్పష్టం చేసింది. దీంతో అన్నపూర్ణమ్మ తన కూతురు సీతానగరం లోనే చనిపోయిందని గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్లు సాక్ష్యం అని చెప్పింది. ఆయన పంచాయతీ కార్యదర్శి వినిపించుకోలేదు. మరణ ధ్రువీకరణ పత్రం ఇచ్చేది లేదని, ఆమె ఎక్కడ చనిపోయిందో అక్కడే తెచ్చుకోమని స్పష్టం చేసింది. దీంతో అన్నపూర్ణమ్మ సర్పంచ్, ఉప సర్పంచ్ ల వద్దకు వెళ్లి విషయం చెప్పింది. అయినా ఫలితం లేకుండా పోయింది. తనకు ఆశా కార్యకర్త ఇచ్చిన నివేదిక ఆధారంగానే మరణ ధ్రువీకరణ పత్రం ఇస్తానని పంచాయతీ కార్యదర్శి స్పష్టం చేసినట్లు ఆమె తెలిపింది. అధికారులు జోక్యం చేసుకుని తనకు న్యాయం చేయాలని బాధితురాలు అధికారులను వేడుకుంటుంది.